AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్‌ ఇప్పుడు రొమాంటిక్ హీరో.. స్టార్ హీరోయిన్లతో అఫైర్లు.. 40+లోనూ సింగిలే

సాధారణంగా స్టార్ హీరోలకు అమ్మాయిల ఫాలోయింగ్ ఉంటుంది. కానీ ఈ హీరో క్రేజ్ నెక్ట్స్ లెవెల్.. ఈ హీరోతో కలిసి నటించిన హీరోయిన్లందరూ అతని ప్రేమలో పడిపోతారు. అయితే 40 ప్లస్ లోనూ ఈ రొమాంటిక్ హీరో సింగిల్ గానే ఉండడం గమనార్హం.

Tollywood: ఈ ఛైల్డ్ ఆర్టిస్ట్‌ ఇప్పుడు రొమాంటిక్ హీరో.. స్టార్ హీరోయిన్లతో అఫైర్లు.. 40+లోనూ సింగిలే
Kollywood Actor
Basha Shek
|

Updated on: Aug 28, 2025 | 7:18 PM

Share

ఈ ఫొటోలో క్యూట్ గా, ఇన్నోసెంట్ గా కనిపిస్తున్న పిల్లాడిని గుర్తు పట్టారా? ఈ బుడ్డోడు ఇప్పుడు దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో గా వెలుగొందుతున్నాడు. లవ్‌, యాక్షన్‌, కామెడీ, ఫ్యామిలీ.. ఇలా ఏ జానర్ సినిమాలకైనా ఇట్టే సరిపోతాడు. తండ్రి స్టార్ డైరెక్టర్ కావడంతో చిన్న వయసులోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఛైల్డ్ ఆర్టిస్టుగా పలువురి స్టార్ హీరోల సినిమాల్లో యాక్ట్ చేశాడు. ఆ తర్వాత హీరోగానూ ఇంట్రీ ఇచ్చాడు. కెరీర్ మొదట్లో ఎక్కువగా లవ్ అండ్ రొమాంటిక్ సినిమాల్లో నటించాడు. యూత్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత యాక్షన్ హీరోగానూ అభిమానులను అలరించాడు. అన్నట్లు ఇతను కేవలం హీరోనే కాదు మంచి సింగర్ కూడా. పలువురి స్టార్‌ హీరోల సినిమాల్లో పాటలు పాడి సంగీత ప్రియులను అలరించాడు. సినిమాల సంగతి పక్కన పెడితే.. లవ్, డేటింగ్, రిలేషన్స్ షిప్ విషయాలతోనూ వార్తల్లో నిలుస్తుంటాడీ హ్యాండ్సమ్ హీరో. ఈ హీరోతో కలిసి సినిమా చేస్తే చాలు.. ఆ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నడన్న రూమర్లు ఇట్టే పుట్టుకొస్తాయి. సిల్వర్‌ స్క్రీన్‌పై లవర్‌బాయ్‌గా కనిపించే ఇతనికి నిజ జీవితంలోనూ బోలెడు లవ్ స్టోరీలున్నాయి. నయనతార, త్రిష, హన్సిక, నిధి అగర్వాల్ తదితర స్టార్‌ హీరోయిన్లతో అఫైర్లు నడిపాడంటూ ప్రచారముంది. ఈపాటికి చాలా మందికి అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నామో.. యస్. ఈ పిల్లాడు మరెవరో కాదు.. కోలీవుడ్ స్టార్‌ హీరో శింబు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజేందర్‌ వారసుడిగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు శింబు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటించి మెప్పించాడు. పై ఫొటో అతను చిన్నప్పుడు నటించిన ఓ సినిమాలోదే. కోలీవుడ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతోన్న శింబు మన్మథ, వల్లభ సినిమాలతో తెలుగు వారికి కూడా బాగా దగ్గరైపోయాడు. మధ్యలో వరుసగా పరాజయాలు ఎదుర్కొన్న ఈ హీరో ‘మానాడు’, ‘పాతు తలా’ చిత్రాలతో మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చాడు.

ఇవి కూడా చదవండి

శింబు లేటెస్ట్ ఫొటోస్..

50 సినిమాలకు దగ్గరలో.

ఈ ఏడాది థగ్ లైఫ్ సినిమాతో ఆడియెన్స్ ను పలకరించాడు శింబు. మణిరత్నం తెరకెక్కించిన ఈ సినిమాలో కమల్ తో కలిసి నటించాడు శింబు. అయితే భారీ అంచనాల మధ్యన రిలీజైన ఈ మూవీ పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం తన 49వ సినిమాతో బిజీగా ఉంటున్నాడీ క్రేజీ హీరో.

థగ్ లైఫ్ సినిమాలో కమల్ తో కలిసి..

View this post on Instagram

A post shared by Netflix India (@netflix_in)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
6 నెలలు ఉడికించిన చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఊహించని..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు హీరోయిన్..
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
అఖండ 2 క్లైమాక్స్‌ చూస్తూ థియేటర్‌లో మహిళకు పూనకం! వీడియో వైరల్
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
బీర్‌ తాగేందుకు రైట్‌టైమ్‌ ఏదో తెలుసా..?ఈ తప్పులు అస్సలు చేయకండి!
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మగాళ్లకే కాదు మహిళలకు కూడా.. లేడీ వయాగ్రా వచ్చేసింది..
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
మెస్సీ ఇండియాలో ఎందుకు మ్యాచ్ ఆడలేదు.. కారణం తెలిస్తే షాక్
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
9 గంటల్లోనే నర్సాపూర్ టు చెన్నై.. వందేభారత్ షెడ్యూల్ ఇదిగో
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
భరణి ఎలిమినేట్.. కాళ్లమీద పడ్డ తనూజ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?
PPFలో నెలకు రూ.7000 జమ చేస్తే మెచ్యూరిటీ సమయానికి ఎంత వస్తుంది?