పై ఫొటోలో ఉన్న బుజ్జి అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా? మూవీస్ ఎక్కువగా చూసేవారు పోలీకలు చూసి తనెవరో గుర్తుపట్టొచ్చు. ప్రస్తుతం తెలుగులో హాట్ అందాలతో కుర్రాళ్లకు వర్షాకాలంలోనూ చమటలు పట్టిస్తోంది. సోషల్ మీడియాలో తన క్రేజ్ మాములుగా లేదు. మోడలింగ్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు హీరోయిన్‌గా మంచి చాన్సులు అందుకుంటుంది. మీకు క్లూ కావాలా.. అయితే తను.. ఢిల్లీకి చెందిన అమ్మాయి. ఓ స్టార్ డైరెక్టర్ తనయుడి సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత.. మెగా హీరోలతో వరస సినిమాలు చేసింది. భారీ హిట్స్ అందుకోకపోయినా.. అమ్మడి క్రేజ్ మాత్రం నెక్ట్స్ లెవల్. ఎంటి ఇన్ని క్లూస్ ఇచ్చిన కనిపెట్టలేకపోయారా.. ఇక మేం చేప్పేస్తాం.. తను హీరోయిన్ హీరోయిన్ కేతిక శర్మ.
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా నటించిన బ్రో మూవీతో ఈ సుందరాంగి హిట్ అందుకుంది. బ్రో సినిమాతో ఒక అరుదైన రికార్డు నెలకొల్పింది ఈ ముద్దుగుమ్మ. అదేంటంటే.. ముగ్గురు మెగా హీరోలతో నటించిన హీరోయిన్లలో ఒకరిగా తన మార్క్ వేసింది. బ్రో కంటే ముందు మరో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో కలిసి రంగరంగ వైభవంగా చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. అయితే బ్రో తర్వాత కేతిక మరో సినిమా సైన్ చేయలేదు. ఇంత అందంగా ఉండే కేతికకు చాన్సులు రాలేదంటే నమ్మలేం. తనే కొంతకాలం బ్రేక్ తీసుకోవాలి అనుకుందేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.