Shahrukh Khan: రైనాకు చేతులెత్తి దండంపెట్టి క్షమించమని అడిగిన షారుక్.. అసలు ఏం జరిగిందంటే
ఈ ఏడాది ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ అదరగొడుతోంది. రీసెంట్ గా ఫైనల్ కు చేరుకుంది. హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 13.4 ఓవర్లలోనే సాధించింది. దాంతో షారుక్ ఖాన్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అయితే స్టేడియంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. సురేష్ రైనాకు షారుక్ ఖాన్ క్షమాపణలు చెప్పాడు.

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సినిమాలతో పాటు ఐపీఎల్ తోనూ బిజీగా ఉన్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ కు షారుక్ ఖాన్ యజమాని అని తెలిసిందే. ఇక ఈ ఏడాది ఐపీఎల్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ అదరగొడుతోంది. రీసెంట్ గా ఫైనల్ కు చేరుకుంది. హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ కేవలం 13.4 ఓవర్లలోనే సాధించింది. దాంతో షారుక్ ఖాన్ ఫుల్ హ్యాపీ అయ్యారు. అయితే స్టేడియంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. సురేష్ రైనాకు షారుక్ ఖాన్ క్షమాపణలు చెప్పాడు. అసలు సురేష్ రైనాకు షారుక్ ఎందుకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.?
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అనంతరం షారూఖ్ ఖాన్ గ్రౌండ్ లోకి వచ్చాడు. అంతే కాదు అభిమానుల వైపు చేతులు ఊపుతూ సంతోషం వ్యక్తపరిచాడు. సురేష్ రైనా, ఆకాష్ చోప్రా గ్రౌండ్ లో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. అయితే షారుక్ అది గమనించకుండా.. షారుక్ గ్రౌండ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత సురేష్, ఆకాష్ లైవ్ లో ఉన్నారని షారుక్ కి గమనించాడు. దాంతో వారికి ఇబ్బంది కలిగించాను అని భావించిన షారుక్ వారికి క్షమాపణలు చెప్పాడు. అందరికీ హగ్ ఇచ్చి, షేక్ హ్యాండ్ ఇచ్చి క్షమాపణలు చెప్పిఅక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
షారుక్ ఖాన్ ప్రవర్తించే విధానం పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. షారుఖ్ ఖాన్ స్టార్ , పైగా KKR కూడా సహ యజమాని. అతను క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ, అతను తన తప్పుకు క్షమాపణ చెప్పాడనినిజంగా గొప్ప విషయం అని అంటున్నారు నెటిజన్స్. హైదరాబాద్‌పై విజయంతో కేకేఆర్ ఫైనల్‌కు నేరుగా టికెట్‌ను బుక్ చేసుకుంది. ఆదివారం (మే 26) చెన్నైలో ఫైనల్ జరగనుంది. ఈరోజు నాడో ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్ సీబీ, రాజస్థాన్ జట్లు తలపడుతున్నాయి.
#ShahRukhKhan doing his traditional victory lap 💜#KKRvsSRHpic.twitter.com/zUdlCgRZla
— 😎Sourav Srkian Das😎 (@SrkianDas04) May 21, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.