Salman Khan: సల్మాన్‌కు ధైర్యం ఉంటే అతన్ని కాపాడమనండి.. అర్ధరాత్రి బెదిరింపు కాల్

|

Nov 08, 2024 | 10:37 AM

ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి సల్మాన్ ఖాన్‌ను బెదిరించారు. ఆ బెదిరింపులో, సల్మాన్ ఖాన్  జింకలను వేటాడిన దానికి అతన్ని క్షమించమని అలాగే రూ. 5 కోట్ల రూపాయలు అడిగారు. ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Salman Khan: సల్మాన్‌కు ధైర్యం ఉంటే అతన్ని కాపాడమనండి.. అర్ధరాత్రి బెదిరింపు కాల్
Salman Khan
Follow us on

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు కొద్దిరోజులుగా బెదిరింపు మెసేజ్ లు, ఫోన్ కాల్స్ వస్తున్న విషయం తెలిసిందే.  సల్మాన్ ను చంపుతాం అని లారెన్స్ గ్యాంగ్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్‌కు లారెన్స్ గ్యాంగ్ నుంచి మళ్లీ బెదిరింపు మెసేజ్ వచ్చింది. గురువారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఇది జరిగింది. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఈ పాట రచయిత ఒక నెలలోపు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుదని.. మరోసారి పాటలు రాయలేనివిధంగా అతని పరిస్థితి ఉంటుందని గుర్తు తెలియని వ్యక్తులు పేర్కొన్నారు. అలాగే సల్మాన్‌కు ధైర్యం ఉంటే వారిని రక్షించాలని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి : Dookudu : ఇదెక్కడి అరాచకం రా మావ..!! దూకుడు టైటిల్ సాంగ్ బ్యూటీ దుమ్మురేపుతోందిగా..!

తాజాగా ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూంకు ఫోన్ చేసి సల్మాన్ ఖాన్‌ను బెదిరించారు. ఆ బెదిరింపులో, సల్మాన్ ఖాన్  జింకలను వేటాడిన దానికి అతన్ని క్షమించమని అలాగే రూ. 5 కోట్ల రూపాయలు అడిగారు. ఇవ్వాలని డిమాండ్ చేశారు. 1998లో రాజస్థాన్‌లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ షూటింగ్ సమయంలో సల్మాన్ ఖాన్ జోధ్‌పూర్‌లో వేటకు వెళ్లాడు. ఆ రాత్రి సల్మాన్ కృష్ణజింకను వేటాడినట్లు సమాచారం. ఈ కృష్ణ జింకను బిష్ణోయ్ సమాజంలో ఎంతో గౌరవంగా భావిస్తారు. ఈ కారణంగానే కృష్ణజింకలను వేటాడిన కేసులో సల్మాన్ ఖాన్ పేరు వినిపించిన వెంటనే బిష్ణోయ్ వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. 2018లో జోధ్‌పూర్ కోర్టు సల్మాన్ ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది, అయితే రెండు రోజుల తర్వాత సల్మాన్ ఖాన్ బెయిల్‌పై విడుదలయ్యాడు.

ఇది కూడా చదవండి :దుల్కర్, విజయ్ ఎత్తుకున్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

దీంతో ఆగ్రహించిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. అప్పటి నుంచి లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌కు బద్ధ శత్రువు అయ్యాడు. రాజస్థాన్‌లోని బికనీర్‌లోని బిష్ణోయ్ కమ్యూనిటీకి చెందిన ప్రధాన ఆలయానికి వచ్చి కృష్ణజింకలను వేటాడినందుకు క్షమాపణ చెప్పాలని లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌ను డిమాండ్ చేశాడు. కొంతకాలం క్రితం ముంబైలోని సల్మాన్ ఖాన్ ఇంటి పై కాల్పులు జరిగాయి. గత నెలలో సల్మాన్ ఖాన్ సన్నిహితుడు బాబా సిద్ధిఖీ కూడా ముంబైలో కాల్చి చంపబడ్డాడు. ఈ కేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ పేరు వినిపిస్తోంది.

ఇది కూడా చదవండి :Kasthuri Shankar: హీరోయిన్ అవ్వాలని స్టార్ డైరెక్టర్‌కు పర్సనల్ ఫోటోలు పంపిన కస్తూరి.. ఆ దర్శకుడు ఎవరో తెలుసా..

సల్మాన్ ఖాన్‌తో పాటు షారుఖ్ ఖాన్‌కు కూడా ఫైజాన్ అనే వ్యక్తి నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. దీనికి సంబంధించి ముంబైలోని బాంద్రా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. నిందితుడు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ నివాసి అని, అతనే షారుఖ్ ఖాన్‌కు బెదిరింపు కాల్ చేసినట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.