స్కూల్లో మూడుసార్లు ఫెయిల్ అయ్యా.. ! ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్నా

ఇండస్ట్రీలో ఇప్పుడున్న స్టార్స్ లో ఆయన ఒకరు. ఆయన సినిమా వస్తుందంటే చాలు అభిమానులు థియేటర్స్ కు క్యూ కడుతుంటారు. ఏడాది మూడు నాలుగు సినిమాలు చేస్తూ అభిమానులు విశేషంగా ఆకట్టుకుంటున్నాడు ఆ స్టార్ హీరో. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.?

స్కూల్లో మూడుసార్లు ఫెయిల్ అయ్యా.. ! ఇప్పుడు స్టార్ హీరోగా రాణిస్తున్నా
Hero

Updated on: Apr 10, 2026 | 1:28 PM

సినిమా సెలబ్రెటీలు అంటే పెద్ద పెద్ద చదువులు చదువుకోవాల్సిన అవసరం లేదు, ఎంతో మంది సినీ దిగ్గజాలు, ఇంటర్ లోపే చదివిన వారు ఉన్నారు. చదివింది తక్కువే ఆయన ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే హీరో కూడా అదే కోవలో వస్తాడు. ఇండియన్ సినిమాల్లోనే ఆయన ఓ టాప్ హీరో.. ఎన్నో సూపర్ హిట్స్, మరెన్నో బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అంతే కాదు ఏ హీరో టచ్ చేయని రేర్ రికార్డ్స్ కూడా క్రియేట్ చేశాడు ఆ స్టార్.. అయితే ఆ హీరో చదివింది తక్కువే కానీ ఇప్పుడు ఇండియాలో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. ఇంతకూ ఆయన ఎవరో తెలుసా.?

జోడీ సెట్.. పెద్ది సినిమాలో చరణ్‌తో స్పెషల్ సాంగ్ చేసేది ఈ అమ్మడేనట

బాలీవుడ్ లో స్టార్ గా రాణిస్తున్న హీరోల్లో అక్షయ్ కుమార్ ఒకరు. బాలీవుడ్ లో అత్యధిక ఫ్లాప్స్ అందుకున్న హీరో ఎవరు అంటే టక్కున చెప్పే పేరు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ హిట్స్, ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఏడాదికి 4, 5 సినిమాలు చేస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. కోవిడ్ పాండమిక్ తర్వాత అక్షయ్ కుమార్ నటించిన 16సినిమాలు విడుదలయ్యాయి. ఇందులో 2-3 సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. అక్షయ్ కుమార్ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఆయన చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అవుతున్నాయి.

వార్ని..! ఈ నటుడి భార్య ఈమేనా..!! తెలుగులో చాలా పాపులర్ నటి కదా గురూ..!!

ప్రస్తుతం భూత్ బంగ్లా సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా అక్షయ్ కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ‘వీల్ ఆఫ్ ఫార్చ్యూన్’ లైవ్ ఎపిసోడ్‌లో అక్షయ్ తన చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నాడు. తన స్కూల్ డేస్ ను గుర్తు చేసుకుంటూ.. నేను స్కూల్ డేస్ లో టాపర్ ను కాను. చదువుల్లో ఎప్పుడూ వెంబడే ఉండేవాడిని.. చాలాసార్లు ఫెయిల్ అయ్యానని చెప్పారు. చదువుల్లో రాణించకపోయిన తనకు ఇతర ప్రతిభను బయటపెట్టి ఇప్పుడు స్టార్ గా ఎదిగా అని తెలిపాడు అక్షయ్. సక్సెస్‌కి మార్కులు ముఖ్యం కాదని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

ఈ విలన్ మామూలోడు కాదు..! ఎకరం భూమిని కేవలం రూ. 100 కొంటే.. ఇప్పుడు అవి రూ.100 కోట్లు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us