Tollywood: అయ్యా బాబోయ్.. ఆ ఒక్క కారణంతో ఇన్నాళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్న హీరోయిన్.. కోట్లు సంపాదించినా కొనలేకపోతుందట..

హీరోయిన్ అంటే గ్లామర్ కాదు.. ప్రాధాన్యత ఉన్న పాత్ర, కంటెంట్ ముఖ్యం అంటుంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఆమె నటించిన ఒక్కో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం సినిమాలే కాదు.. కొన్ని బ్రాండ్‌లకు ప్రచార అంబాసిడర్‌గా ఉంటూ వాటి ద్వారా ఎక్కువే సంపాదిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న ఈ హీరోయిన్..

Tollywood: అయ్యా బాబోయ్.. ఆ ఒక్క కారణంతో ఇన్నాళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్న హీరోయిన్.. కోట్లు సంపాదించినా కొనలేకపోతుందట..
Actress
Follow us

|

Updated on: Sep 28, 2024 | 8:52 AM

సినీరంగుల ప్రపంచంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ అంటే గ్లామర్ కాదు.. ప్రాధాన్యత ఉన్న పాత్ర, కంటెంట్ ముఖ్యం అంటుంది. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించింది. ఆమె నటించిన ఒక్కో సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. కేవలం సినిమాలే కాదు.. కొన్ని బ్రాండ్‌లకు ప్రచార అంబాసిడర్‌గా ఉంటూ వాటి ద్వారా ఎక్కువే సంపాదిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఓ రేంజ్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకున్న ఈ హీరోయిన్.. ఇప్పటికీ అద్దె ఇంట్లోనే ఉంటుంది. అందుకు పెద్ద కారణమే ఉందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?.. తనే విద్యా బాలన్. హిందీలో అనేక చిత్రాల్లో నటించి తనదైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న ముద్దుగుమ్మ. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను వివాహం చేసుకుంది. సినీ పరిశ్రమలో ఇద్దరూ అత్యత్తమ స్థానాల్లోనే ఉన్నారు.. కానీ వారిద్దరి నివాసం ఇప్పటికీ అద్దె ఇళ్లే అని తెలిసి అవాక్కవుతున్నారు ఫ్యాన్స్. అందుకు ఒక ముఖ్యమైన కారణం కూడా ఉందట.

ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో తాను అద్దె ఇంట్లో ఉండడానికి గల కారణాన్ని చెప్పుకొచ్చింది విద్యాబాలన్. నిజానికి పెళ్లి తర్వాత కొత్త ఇల్లు కొనాలని నిర్ణయించుకుందట. భర్తతో కలిసి చాలా ఇళ్లు వెతికినప్పటికీ తనకు నచ్చిన ఇల్లు దొరకలేదట. చివరకు తనకు నచ్చిన ఇల్లు కొనాలని ప్రయత్నించగా.. దానిని అమ్మేందుకు సదరు ఇంటి యజమానులు సిద్ధంగా లేరట. దీంతో ఈ ఇంటిని కొనలేక.. అందులోనే అద్దెకు ఉంటుంది విద్యా. సముద్రానికి ఎదురుగా ఉన్న ఈ ఇంట్లో అందమైన తోటతోపాటు.. అద్భుతమైన వ్యూ పాయింట్ ఉంది. అందుకే ఆ ఇంటి పై మనసు పడిన విద్యాబాలన్.. చివరకు అదే ఇంట్లో అద్దెకు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

విద్యాబాలన్ బెంగాలీ, హిందీ, మలయాళం, తమిళం, తెలుగు సినిమాల్లో నటించింది. ‘పరిణీత’, ‘లగే రహో మున్నా భాయ్‌’, ‘భూల్‌ భూలయ్య’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె నటించిన ‘భూల్ భూలయ్య 3’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. దీపావళి పండగ సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కానుంది.

View this post on Instagram

A post shared by Vidya Balan (@balanvidya)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.