Personality Test: మీ ముక్కు ఆకారం బట్టి.. మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు. ఎలాగంటే..

మన ఆలోచనలు ఎలా ఉంటాయి.? మన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియాలంటే. మనతో మాట్లాడితే కానీ తెలియదు. అయితే మన ముఖ కవలికలు, మన శరీరంలోని భాగాల ఆధారంగా కూడా మనం ఎలాంటి వాళ్లమో చెప్పొచ్చని మానసిక నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో ముక్క ఆకారం ఒకటి. ముక్కు ఆకారం ఆధారంగా మనం ఎలాంటి వాళ్లం...

Personality Test: మీ ముక్కు ఆకారం బట్టి.. మీరు ఎలాంటి వారో చెప్పొచ్చు. ఎలాగంటే..
Follow us

|

Updated on: Sep 28, 2024 | 12:22 PM

మన ఆలోచనలు ఎలా ఉంటాయి.? మన వ్యక్తిత్వం ఎలాంటిదో తెలియాలంటే. మనతో మాట్లాడితే కానీ తెలియదు. అయితే మన ముఖ కవలికలు, మన శరీరంలోని భాగాల ఆధారంగా కూడా మనం ఎలాంటి వాళ్లమో చెప్పొచ్చని మానసిక నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో ముక్క ఆకారం ఒకటి. ముక్కు ఆకారం ఆధారంగా మనం ఎలాంటి వాళ్లం. మన ఆలోచనలు ఎలాంటివో చెప్పొచ్చని అంటున్నారు. మరి ముక్కు ఆకారం ఆధారంగా మన ఆలోచనలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం..

*  ఒకవేళ మీరు పెద్ద ముక్కు కలిగి ఉన్న వారైతే.. మీకు అధిక మేధస్సు స్థాయిలు కలిగిన వ్యక్తి అని అర్థం. మీరు చాలా స్వతంత్రంగా ఉంటారని, ప్రతీ అంశంపై మీకంటూ ఒక సొంత అభిప్రాయాన్ని కలిగిఉంటారు. ఇతరులపై ఆధారపడి జీవించడానికి ఇష్టపడరు. మీ లక్ష్యాలను చేరుకోవడానికి మీ సొంత మార్గాలను అనుసరిస్తారు. ఇతరులు సహాయం చేస్తానంటే కూడా అంత సులువుగా స్వీకరించరు. ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా జీవించాలని, సొంతగా పైకి రావాలనే ఆసక్తితో ఉంటారు.

* మీ ముక్కుపై కండరం ఉన్నట్లు ఉంటే మీరు సున్నిత మనస్కులు అని అర్థం. మీరు ఫాస్ట్‌ థింకర్‌ అని అర్థం. మీ విజులవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎక్కువగా ఉంటుంది. ఊహశక్తి అధికంగా ఉంటుంది. భవిష్యత్తును ఇట్టే అంచనా వేయగలుగుతారు. దృఢమైన లక్ష్యాలతో ముందుకు సాగుతారు. అయితే మీకు త్వరగా చికాకు, కోపం వస్తుంటుంది. పైకి ఒకటి లోపల మరొకటి అనే విధంగా మీరు ఉండరు.

* మీ ముక్కు కాస్త వంగినట్లు కనిపిస్తే మీరు కొత్తదనాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తారని అర్థం. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. లక్ష్యాలను సాధించాలనే ఉత్సాహం మీలో ఎక్కువగా ఉంటుంది. అందరిలా కాకుండా ప్రత్యేకంగా ఆలోచించాలని కోరుకుంటారు. ఇతరుల మనోభావాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా పని చేసే ముందు దానివల్ల కలిగే లాభనష్టాల గురించి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు.

* ఒకవేళ మీ ముక్కు గద్ద ముక్కు ఆకారంలో ఉన్నట్లయితే.. మీరు మీ నిబంధనల ప్రకారం జీవించడానికి ఇష్టపడతారని అర్థం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. స్వతంత్ర భావతో ఉంటారు. మీకంటూ ప్రత్యేక ఆలోచనలు కలిగి ఉంటారు. చేసే పనిపట్ల అంకిత భావంతో ఉంటారు. పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి కృషి చేస్తారు.

Personality Test

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు నిపుణులు తెలిపిన విషయాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయల ఆధారలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..