మృణాల్ ఠాకూర్.. హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన సీతా రామం సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్.
ఇక మృణాల్ పర్సనల్ విషయానికి వస్తే.. ఆమె 1 ఆగస్టు 1992న మహారాష్ట్రలోని ధూలేలో జన్మించారు. మృణాల్ ముంబైలోని KC కాలేజీ నుండి మాస్ మీడియా చదివారు.
ఇక ఆమె సినీ కెరీర్ విషయానికి వస్తే.. మృణాల్ ఠాకూర్ 2014లో విడుదలైన మరాఠీ చిత్రం, విట్టి దండుతో సినీ రంగ ప్రవేశం చేశారు.
ఇక హిందీలో ఆమె 2019లో వికాస్ బహ్ల్ బయోపిక్ సూపర్ 30 నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇక 2020లో ఠాకూర్ నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ ఘోస్ట్ స్టోరీస్‌లో మంచి పాత్రలో మెరిశారు.
అదే సంవత్సరం జాన్ అబ్రహంతో కలిసి 'గల్లన్ గోరియా' అనే మ్యూజిక్ వీడియోలో కనిపించారు. ఠాకూర్ రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించిన తూఫాన్ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటించారు.
ఇక రిసెంట్ ఠాకూర్ నటించిన సినిమా జెర్సీ. ఈ సినిమా 2019 తెలుగు చిత్రం జెర్సీ రీమేక్‌గా వచ్చింది. ఈ సినిమాలో ఆమె షాహిద్ కపూర్‌తో కలిసి నటించారు.
‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ తర్వాత మృణాల్ నటించిన తెలుగు చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె ఇందుగా కనిపించారు.