AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముస్లింను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆమెతో మాట్లాడే ప్రసక్తే లేదంటున్న సోదరులు

ఇటీవల సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. చాలా మంది తాము ప్రేమించిన వారిని పెళ్లి చేసుకొని హ్యాపీగా గడుపుతున్నారు. చాలా మంది మతాంతర , కులాంతర వివాహాలు కూడా చేసుకున్నారు. వారిలో ఈ హీరోయిన్ ఒకరు. హిందూ అయిన ఈ స్టార్ హీరోయిన్ ఓ ముస్లిం యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

ముస్లింను ప్రేమించి పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్.. ఆమెతో మాట్లాడే ప్రసక్తే లేదంటున్న సోదరులు
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 26, 2025 | 9:06 PM

Share

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఇటీవల పెళ్లి పీటలెక్కారు. పెళ్ళికి కులాలు, మతాలు చూసే రోజులు దాదాపు పోయాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో మతాంతర వివాహాలు చాలానే జరిగాయి. సినిమా వాళ్ళు అలాంటివి అస్సలు పట్టించుకోరు. కానీ ఓ హీరోయిన్ మాత్రం తన కుటుంబం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటుందని తెలుస్తుంది. ఆ స్టార్ హీరోయిన్ ఇటీవలే వివాహం చేసుకుంది. అయితే అది మతాంతర వివాహం కావడంతో ఆమె ఇంట్లో వాళ్ళు ఆమెతో మాట్లాడటం లేదు అని ఇప్పుడు వార్త చెక్కర్లు కొడుతుంది. ఆమె ఓ స్టార్ హీరోయిన్.. ఆమె తండ్రి కూడా ఓ స్టార్ నటుడు. సినీ ఇండస్ట్రీలో ఎంతో పలుకుబడి ఉన్న ఆ అమ్మడు ఓ ముస్లిం యువకుడిని ప్రేమించి పెళ్లాడింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : స్టార్ హీరో సినిమా నుంచి శ్రీలీల అవుట్..! షూటింగ్ మధ్యలోనే తీసేసిన మేకర్స్.?

ఆమె మరెవరో కాదు బాలీవుడ్ అందాల భామ సోనాక్షి సిన్హా. సోనాక్షి సిన్హా సోదరులిద్దరూ ఆమె మతాంతర వివాహం పట్ల సంతోషంగా లేరనే విషయంపై చర్చ జరుగుతుంది. ఇప్పుడు దీని పైనే బాలీవుడ్ లో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సోదరి సోనాక్షి ఇటీవలే ముస్లిం ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను వివాహం చేసుకుంది. మొదట్లో ఆమె పెళ్లిని తండ్రి శత్రుఘ్న ప్రసాద్ సిన్హా కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ ఆతర్వాత ఆయన అంగీకరించారు. కాగా సోనాక్షి ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకోవడం ఆమె సోదరులకు నచ్చలేదని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అయ్యోపాపం.! 20ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్.. స్టార్ హీరోలతో చేసినా కూడా లాభంలేకుండాపోయింది..

దాంతో వారు ఆమెతో మాట్లాడటం లేదని సమాచారం.సోనాక్షికి ఇద్దరు సోదరులు లవ్ సిన్హా, కుష్ సిన్హా. ఇటీవల కుష్ సిన్హా తన సోదరితో వివాదంపై జరుగుతున్న చర్చలపై చివరకు మౌనం వీడాడు. ఆమె ఇప్పటికీ తన సోదరితో మంచి సంబంధాలు కలిగి లేనని చెప్పుకొచ్చాడు. కుష్ త్వరలో ‘నికితా రాయ్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు.  అతని సోదరి సోనాక్షి ‘నికితా రాయ్’లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, కుష్‌ను తన సోదరితో ఉన్న సంబంధం గురించి మాట్లాడాడు. ఆమె ఒక నటి అని, చాలా పని అనుభవం ఉందని సెట్‌లో స్పష్టంగా ఉంది. నేను దీన్ని దృష్టిలో ఉంచుకుని సెట్‌లో ఆమెను ఒక నటిలాగే గౌరవంగా చూసుకున్నాను. నేను అందరినీ ఒకేలా చూస్తాను. అని చెప్పుకొచ్చాడు కుష్ సిన్హా. కాగా ఏడు సంవత్సరాలు డేటింగ్ చేసిన తర్వాత, సోనాక్షి, జహీర్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత, వారు గ్రాండ్ రిసెప్షన్ పార్టీని నిర్వహించారు. అయితే, సోనాక్షి సోదరులు లవ్ , కుష్ ఆ పెళ్ళిలో ఎక్కడా కనిపించలేదు.

ఇది కూడా చదవండి :ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.. స్టార్ డైరెక్టర్ పై మంచు విష్ణు కామెంట్స్..

View this post on Instagram

A post shared by Sonakshi Sinha (@aslisona)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మారిన ఎస్బీఐ ఏటీఎం విత్ డ్రా రూల్స్.. ఈ లిమిట్ దాటితే కష్టమే..
మారిన ఎస్బీఐ ఏటీఎం విత్ డ్రా రూల్స్.. ఈ లిమిట్ దాటితే కష్టమే..
శెనగపప్పు మటన్ కూర.. మన తాతలు బలంగా ఉన్నారంటే ఇలాగే
శెనగపప్పు మటన్ కూర.. మన తాతలు బలంగా ఉన్నారంటే ఇలాగే
రూ.250 కోట్ల లాటరీ గెలిచిన యువకుడు.. ఆ డబ్బుతో ఏం చేశాడంటే?
రూ.250 కోట్ల లాటరీ గెలిచిన యువకుడు.. ఆ డబ్బుతో ఏం చేశాడంటే?
కాశీలో మరణించాలనే కోరిక ఎందుకు? మోక్షంపై ఉన్న పురాతన విశ్వాసం ఇదే
కాశీలో మరణించాలనే కోరిక ఎందుకు? మోక్షంపై ఉన్న పురాతన విశ్వాసం ఇదే
ఇలా స్టోర్‌ చేస్తే వారమైనా కూరగాయలు ఫ్రెష్‌గా ఉండాల్సిందే!
ఇలా స్టోర్‌ చేస్తే వారమైనా కూరగాయలు ఫ్రెష్‌గా ఉండాల్సిందే!
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్..
ఓటీటీలోకి వచ్చేసిన మిస్టరీ థ్రిల్లర్..
జున్నుపాలు లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు హెల్దీ జున్ను
జున్నుపాలు లేకుండా ఇంట్లో అప్పటికప్పుడు హెల్దీ జున్ను
నిప్పులకొలిమిలా మంచు ఖండం.. యూరప్ అంతటా ఆగమాగం..
నిప్పులకొలిమిలా మంచు ఖండం.. యూరప్ అంతటా ఆగమాగం..
రోజూ వాడే కిచెన్ కత్తి ఎలా ఉండాలి? కొనేముందు ఈ విషయాలు తెలసుకోండి
రోజూ వాడే కిచెన్ కత్తి ఎలా ఉండాలి? కొనేముందు ఈ విషయాలు తెలసుకోండి
భర్త మరణిస్తే భార్య క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా..? రూల్స్ ఇవే.
భర్త మరణిస్తే భార్య క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా..? రూల్స్ ఇవే.