కంగనా రనౌత్ ఈ అమ్మడు గురించి చెప్పాలంటే ముందు ఆమె కాంట్రవర్సీలే గుర్తొస్తాయి. సినిమాలకంటే వివాదాలతోనే బాగా పాపులర్ అయ్యింది కంగనా రనౌత్. సినిమా అయినా, కాంట్రవర్సీ అయినా.. కంగనా పేరు ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. అలాగే ఈసారి కూడా కంగనా మరోసారి వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం ఈమె తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో వైరల్ అవుతోంది. కంగనా పెళ్లి ఎప్పుడు? ఆమె ప్రియుడు ఎవరు? ఎన్నో వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఈ ఫైర్ బ్రాండ్ ఎవరిని పెళ్లి చేసుకుంటుందని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా కంగనా రనౌత్ ఓ మిస్టరీ మ్యాన్‌తో కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. . కంగనా ఓ యువకుడు చేతులు పట్టుకుని సెలూన్ నుంచి బయటకు వెళ్తున్న ఫోటో వైరల్‌గా మారింది.
కంగనాతో కనిపించిన ఆ యువకుడు ఎవరు, ఆ ఒక్క ఫోటోతో ఇప్పుడు బీటౌన్ లో రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. కంగనా అతడిని పెళ్లి చేసుకోబోతుందా.? అని పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. కొంతమంది నెటిజన్లు ఆ వ్యక్తిని నటుడు హృతిక్ రోషన్‌లా ఉన్నదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎట్టకేలకు హృతిక్‌లా కనిపించే వ్యక్తి కంగనాకు దొరికాడని కూడా కామెంట్స్ చేస్తున్నారు. అయితే పలువురు అభిమానులు ఈ జోడీ బాగుంది అంటున్నారు. గత ఏడాది అంటే 2023లో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కంగనా పెళ్లి గురించి మాట్లాడింది.
ప్రతిదానికీ ఒక సమయం ఉంటుందని, ఆ సమయం తన జీవితంలోకి రావాలంటే అదే వస్తుందని తెలిపింది. కంగనా కూడా పెళ్లి చేసుకుని కుటుంబంతో గడపాలని ఉందని తెలిపింది. అయితే సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే చేసుకుంటానని తెలిపింది. కంగనా ప్రస్తుతం తన కొత్త చిత్రం ‘ఎమర్జెన్సీ’తో బిజీగా ఉంది. ఆమె ఈ సినిమాలో నటించడమే కాకుండా ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహిస్తోంది. ముందుగా ఈ చిత్రాన్ని నవంబర్ 2023లో విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడు ఈ ఏడాదిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అనుపమ్ ఖేర్, మహిమా చౌదరి, దివంగత నటుడు సతీష్ కౌశిక్, శ్రేయాస్ తల్పాడే కూడా నటిస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.