AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అరే.. ఈ అందాల తారకు ఎంత కష్టమొచ్చింది! అరుదైన చర్మ సమస్యతో బాధపడుతోన్న స్టార్ హీరోయిన్

ఈ స్టార్ హీరోయిన్ కు తన చిన్నప్పటి నుంచే ఈ సమస్య ఉన్నప్పటికీ కొన్నేళ్ల క్రితమే నిర్ధారణ అయ్యిందట. దీంతో మొదట్లో చాలా కంగారు పడిపోయిందీ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత తేరుకుని తనకున్న సమస్య గురించి సోషల్ మీడియా ద్వారా అందరికీ అవగాహన కల్పిస్తోంది.

Tollywood: అరే.. ఈ అందాల తారకు ఎంత కష్టమొచ్చింది! అరుదైన చర్మ సమస్యతో బాధపడుతోన్న స్టార్ హీరోయిన్
Bollywood Actress
Basha Shek
|

Updated on: Oct 15, 2025 | 9:33 AM

Share

సినిమా సెలబ్రిటీలది లగ్జరీ లైఫ్.. వాళ్లకు ఎలాంటి సమస్యలు ఉండవనుకుంటారు చాలా మంది. అయితే ఇది చాలా తప్పు. వారు కూడా మనుషులే. అందరిలాగే వారికి సమస్యలు ఉంటాయి. అందులోనూ గంటల తరబడి కెమెరా లైట్ల ముందు, మేకప్ ఇతర కాస్ట్యూమ్స్ తో ఉండే వారికి ఏవో ఒక సమస్య వెంటాడుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోన్న భూమి పడ్నేకర్ తనకున్న చర్మ వ్యాధి గురించి బయటపెట్టింది. ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో దీని గురించి వెల్లడించింది. భూమి ఎగ్జిమా (తామర) అనే చర్మ వ్యాధితో బాధపడుతోంది.తనకు చిన్నప్పటి నుంచి ఈ సమస్య ఉందట. కానీ ఇది మూడేళ్ల క్రితమే నిర్ధారణ అయింది. తాను ఎక్కువగా ప్రయాణించినప్పుడల్లా, పోషకాహారం తీసుకోకపోయినా లేదా అధిక ఒత్తిడిని అనుభవించినా చర్మంపై దద్దుర్లు రావడం విపరీతంగా దురదలు వస్తాయని భూమి పేర్కొంది. దీని కారణంగా తనకు చాలా అసౌకర్యంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఈ సమస్య గురించి అందరికీ అవగాహన కల్పిస్తానని, తద్వారా ప్రజలు దీనిని సకాలంలో అర్థం చేసుకుని చికిత్స పొందుతారని భూమి తెలిపింది.

ఎగ్జిమాను అటోపిక్ డెర్మటైటిస్ అని కూడా పిలుస్తారు. దీని కారణంగా చర్మంపై దురద, పొడిబారడం, మంట, ఎర్రటి మచ్చలు వంటివి వస్తాయి. ఇది అంటువ్యాధి కాదు, అంటే ఇది స్పర్శ ద్వారా వ్యాపించదు. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, శరీర రోగనిరోధక వ్యవస్థ అలెర్జీ కారకానికి అతిగా స్పందించినప్పుడు ఈ సమస్య వస్తుంది. నేషనల్ హెల్త్ సర్వీస్ (NHS) ప్రకారం ఎగ్జిమా లేదా తామర అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. పెర్ఫ్యూమ్‌లు లేదా రసాయన ఉత్పత్తులను అధికంగా ఉపయోగించడం, దుమ్ము , వాతావరణంలో ఆకస్మిక మార్పులు, ఎక్కువ వేడి, అలాగే చెడు ఆహారపు అలవాట్లు, అధికి ఒత్తిడి మరియు నిద్ర లేకపోవడం ఇలా ఎగ్జిమా రావడానికి చాలా కారణాలున్నాయి. ఈ క్రమంలో భూమి పెడ్నేకర్ కూడా విపరీత ప్రయాణాలు, అనారోగ్యకరమైన ఆహారం, తీవ్రమైన ఒత్తిడుల కారణంగానే ఎగ్జిమా బారిన పడ్డానంటోంది.

ఇవి కూడా చదవండి

భూమి పడ్నేకర్ లేటెస్ట్ ఫొటోస్..

నివారణ చిట్కాలు

ఇక తామరను తగ్గించుకునేందుకు ఈ పద్ధతులు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.  వీలైనంత వరకు హైడ్రేట్ గా ఉండడానికి ప్రయత్నించండి. చర్మం పొడిబారకుండా ఉండటానికి ప్రతిరోజూ మాయిశ్చరైజర్ రాయండి.  మరీ ఎక్కవ వేడి నీటిలో స్నానం చేయవద్దు. రసాయన లేదా సువాసనగల సబ్బులను దూరం పెట్టండి. ఒత్తిడిని తగ్గించడానికి యోగా లేదా ధ్యానం చేయండి. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు పుష్కలంగా తినండి. అలాగే నీరు ఎక్కువగా తాగండని డెర్మటాలజిస్టులు సూచిస్తున్నారు. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..