
బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ ఒకరు. బిగ్ బాస్ ఐదో సీజన్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన ఆమె తన ఆట, మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెల్చుకుంది. విజేతగా నిలవకపోయినా ఏకంగా 90 రోజులకు పైగా బిగ్‌బాస్ హౌస్‌లో గడిపింది. అంతకు ముందు జబర్దస్త్ లో లేడీ గెటప్పులతో అలరించాడు సాయి తేజ. . అన్ని టీమ్స్‌లోనూ సందడి చేసిన అతను ఆ తర్వాత సర్జరీతో ట్రాన్స్‌జెండర్‌గా మారిపోయాడు. తన పేరును ప్రియాంక సింగ్ గా మార్చుకుంది. ఆపై అదిరింది, కామెడీ స్టార్స్ వంటి షోల్లోనూ సందడి చేసింది పింకీ. ముఖ్యంగా కరోనా సమయంలో’ ఇట్స్‌మీ ప్రియాంక’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి బాగా పాపులరైంది ప్రియాంక. ఆసక్తికరమైన వీడియోలు చేస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోనూ అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైంది.
బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లో సందడి చేసింది ప్రియాంక. అయితే ఇటీవల కాలంలో మాత్రం బాగా సైలెంట్ అయిపోయింది. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాత్రమే కనిపిస్తోంది. అలా తాజాగా ప్రియాంక సింగ్ షేర్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇందులో ఆమె బ్లూ కలర్ శారీ ధరించి మెడలో తాళిబొట్టుతో మిర్రర్ సెల్ఫీ తీసుకుంటూ కనిపించింది. దీంతో క్షణాల్లోనే ఈ వీడియో వైరల్ గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. పింకీ సీక్రెట్ గా పెళ్లి చేసుకుందా? ఆమె జీవిత భాగస్వామి ఎవరు? అని కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇది షూటింగ్ కోసం సరదాగా చేసిన వీడియో అని తెలుస్తోంది. అదే సమయంలో పవిత్రమైన తాళిని ఇలా కూడా వాడుకుంటున్నారా? అని కొంతమంది నెటిజన్లు పింకీపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.