బిగ్ బాస్ హౌస్ లో నామినేషన్స్ ప్రక్రియ జరుగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో రతికా రచ్చ తో విసిగిపోయిన ప్రేక్షకులు ఈ రోజు జరిగే ఎపిసోడ్ తో కొంచం ఎంజాయ్ చేస్తారనే అనిపిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తుంటే.. నిన్నటి ఎపిసోడ్ లో రతికా శోభా శెట్టి, ప్రియంకాలను నామినేట్ చేసింది. ఆ తర్వాత ప్రియాంక రతికా, అశ్విని ని నామినేట్ చేసింది అలాగే అర్జున్ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేశాడు. ఇక గౌతమ్ అర్జున్ ను, అమర్ దీప్ ను నామినేట్ చేశాడు. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో కూడా నామినేషన్స్ చూపించారు. ముందుగా అశ్విని అమర్ ను నామినేట్ చేసింది. ఈ నామినేషన్ సిల్లీగా ఉంది అని ముందే చెప్పింది అశ్విని. తన పై పాట పాడాడని అమర్‌ను నామినేట్ చేసింది అశ్విని. ఆ తర్వాత నా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి అని అనడంతో నవ్వులు పూశాయి.
ఆతర్వాత పల్లవి ప్రశాంత్ అర్జున్ ను నామినేట్ చేశాడు. తనను నామినేట్ చేసిన పాయింట్ గురించి చెప్తూనే అర్జున్ ను నామినేట్ చేశాడు ప్రశాంత్.. దాంతో అర్జున్ ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు. ఆతర్వాత శోభా శెట్టి పై అశ్విని సీరియస్ అవ్వడం చూపించారు. మధ్యలో ఎందుకు దూరుతున్నావ్ అంటూ శోభా పై సీరియస్ అయ్యింది అశ్విని.
ఆతర్వాత అమర్ దీప్, యావర్ ను నామినేట్ చేశాడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అలాగే శోభా శెట్టి కూడా యావర్ ను నామినేట్ చేసింది. దాంతో యావర్ మళ్లీ శోబాతో గొడవ పడ్డాడు. ఇక అర్జున్ , ప్రశాంత్ మధ్య మళ్లీ గొడవ జరిగింది. నేను చెప్పేది తప్పు అనడానికి నువ్వెవర్రా..? అని అర్జున్ అడిగితే వెళ్లి గూగుల్ ని అడుగు అని ప్రశాంత్ దురుసుగా సమాధానం చెప్పాడు. దాంతో అర్జున్ ఒక్కసారిగా మండిపడ్డాడు. పల్లవి ప్రశాంత్ నన్ను నామినేట్ చేస్తే నేను అడుగుతా వేరేవాళ్లను ఎందుకు అడుగుతా రా..? అని ఫైర్ అయ్యాడు. ఆతర్వాత నామినేట్ చేసిన వాళ్ల తలపై బాటిల్స్ పగల గొట్టారు. చివరిలో అమర్ దీప్ ఒక్క నిమిషం అంటూ వచ్చి అందరికి దీపావళి శుభాకాంక్షలు గెట్ ఏ బ్లాస్ట్ అని చెప్పాడు .
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి..