Bigg Boss 10: హౌస్‌మేట్స్ ఎంగిలి చేసిన గ్లాసులు కడిగిన నాగార్జున.. రోహిత్‌కు ఇచ్చిపడేశారుగా
అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు 10’ బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సెలబ్రిటీలు, కామనర్స్ కలయికతో ప్రారంభమైన ఈ సీజన్ తొలి రోజు నుంచే ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతోంది. షో ప్రారంభమైన మొదటి వారంలోనే డబుల్ ఎలిమినేషన్‌తో చైత్ర రాయ్, చరణ్‌లు హౌస్ నుంచి బయటకు రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

బిగ్ బాస్ సీజన్ 10 ఆసక్తికరంగా సాగుతుంది. హౌస్ మేట్స్ మధ్య విభేదాలు తొలి రోజు నుంచే మొదలయ్యాయి. హౌస్ లో రెండు టీమ్స్ డివైడ్ చేశారు బిగ్ బాస్. అలాగే హౌస్ లో ఇప్పటికే ముగ్గురు హౌస్ మేట్స్ గా కన్ఫర్మ్ అయ్యారు. రోహిత్, వంశీ, రామ్ ప్రసాద్. ఇక శనివారం , ఆదివారం హోస్ట్ నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ కు క్లాస్ తీసుకుంటారన్న విషయం తెలిసిందే. మొదటి శనివారం అంటే నేడు నాగ్ బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చారు. ఇందుకు సంబందించిన పప్రోమోను విడుదల చేశారు. అయితే ఈ ప్రోమోలో నాగ్ రోహిత్ కు గట్టిగానే ఇచ్చిపడేశారు. ముందుగా హౌస్ లో హౌస్ మేట్స్ అయినా ముగ్గురిని గార్డెన్ ఏరియాకు పిలిచారు. ముగ్గురికి కంగ్రాట్స్ చెప్పి ముగ్గురికి మిల్క్ షేక్స్ ఇచ్చారు. ఫాస్ట్ గా తాగేసేయమని చెప్పారు నాగ్. ముగ్గురు ఆ మిల్క్ షేక్స్ తాగిన తర్వాత ఆ గ్లాసులను స్టేజ్ పైకి తీసుకొచ్చారు.
B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్
ఆ గ్లాసులను స్వయంగా నాగార్జున కడిగారు. స్టేజ్ పై నాగ్ హౌస్ మేట్స్ తాగిన ఎంగిలి గ్లాసులు కడటంతో అక్కడ ఉన్నవారు షాక్ అయ్యారు. నాగ్ చేసిన పనికి కంటెస్టెంట్స్ చప్పట్లు కొట్టారు. ఏ పని తక్కువ కాదు.. ఏ పని చిన్నది కాదు. ఎంగిలి గ్లాసులు , ప్లేట్స్ కడిగాను అని చెప్పడం కరెక్ట్ కాదు అని రోహిత్ కు క్లాస్ తీసుకున్నారు నాగార్జున. అలాంటి ఉద్దేశం ఉంటే హౌస్ లో ఉండొద్దు అని అన్నారు నాగార్జున. మీ ఎంగిలి ప్లేట్స్ నేను కడగాలి అనే ఆలోచనలు కరెక్ట్ కాదు అన్నారు నాగ్.
అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
అలాగే ఝాన్సీని లేపి నువ్వు ఏం విన్నావ్ అని అడగ్గా.. మీరు ఎంగిలి చేసినవి నేను ఎందుకు కడగాలి అని అన్నాడు అని చెప్పింది. ఆతర్వాత శాలినిని స్టోర్ రూమ్ కు పంపించి ఎంగిలి కాప్స్ తెప్పించారు నాగ్.. అయితే ఎంగిలి అంటే నేను ఏమన్నన్నంటే అంటూ రోహిత్ ఎదో చెప్పబోతుంటే.. వర్డ్స్ గురించి కాదు.. అయినా నీ డ్యూటీ ఏంటి రోహిత్ .? అని నాగ్ ప్రశ్నించారు. ఈ సీజన్ లో రియాక్షన్ తో పాటు వెంటనే శిక్ష కూడా ఉంటుందని అన్నారు నాగ్. ఆతర్వాత త్రిగుణ్ ను లేపి పిల్ల బచ్చా, డొల్ల రాజా, స్టెరాయిడ్ డొల్ల అని నాగ్ అనగానే. తప్పు నాదే క్షమాపణ అడుగుతా సార్ అని త్రిగుణ్ అన్నాడు . గార్డెన్ ఏరియాలో ఓ టైర్ పెట్టి దాన్ని పైకి ఎత్తి పట్టుకొని నేను చెప్పే వరకు తిరుగుతూ ఉండు అని చెప్పారు నాగ్ ఈ ప్రోమో చూస్తుంటే ఈ రోజు హౌస్ లో ఉన్న వారికి నాగ్ గట్టిగానే ఇచ్చిపడేశారని అర్ధమవుతుంది.
నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




