బిగ్బాస్ సీజన్ 8 ఐదో వారం సాగుతుంది. ఈవారం కంటెస్టెంట్లకు ఊహించని ట్విస్టులు ఇచ్చేందుకు రెడీ అయ్యాడు బిగ్బాస్. సర్వైవల్ ఆప్ ది ఫిట్టెస్ట్ ఛాలెంజ్ లు అన్ని పూర్తి చేయలేకపోయిన కారణంగా ఈసారి మొత్తం 8 మంది వైల్డ్ కార్ట్ ఎంట్రీలు రాబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. అలాగే కొత్తగా చీఫ్ ను ఎన్నుకునే ప్రక్రియను స్టార్ట్ చేశాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో యష్మీ వర్సెస్ మణికంఠ. ఇద్దరి మధ్య ఓ రేంజ్ ఫైట్ జరిగింది. మొత్తం పది మంది పేర్లతో కుక్క బొమ్మలను పెట్టి బజర్ మోగిన వెంటనే వాటిని తీసుకవచ్చి వాటి వాటి హౌస్ లో పెట్టాలి. ఎవరైతే చివరి పప్పీ హౌస్ లోకి తీసుకువస్తారో వారితోపాటు.. ఆ పప్పి మెడలో ట్యాగ్ మీద పేరున్న సభ్యుడు కూడా డేంజర్ జోన్ లో నిలబడాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్కులో ముందు ప్రేరణ పప్పీని చేతిలో పట్టుకొని చివరగా వచ్చింది యష్మీ. దీంతో వీరిద్దరు డేంజర్ జోన్ లో నిలబడ్డారు.
నాకు మళ్లీ చీఫ్ అయ్యే ఛాన్స్ వస్తే నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటూ యష్మీ చెప్పగా.. అంటే అప్పుడు నువ్వు చీఫ్ గా ఫెయిల్ అయ్యావా అని క్వశ్చన్ చేశాడు. చీఫ్ అయ్యాను అని చెప్పి ప్రతిసారి రేసు నుంచి తీయడం కరెక్ట్ కాదంటూ యష్మీ వాదించింది. అయినా ఆమెను రేసు నుంచి అవుట్ అయ్యిందంటూ తన డెసిషన్ చెప్పాడు మణికంఠ. ఇక ఆ తర్వాత మణికంఠ పప్పిని పట్టుకొచ్చింది యష్మీ. ఇంకేముంది ఎప్పటిలాగే అందరూ కలిసి యష్మీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. పృథ్వీ యష్మీకి సపోర్ట్ చేయగా.. కరెక్ట్ డెసిషన్ అంటూ మరింత రెచ్చగొట్టింది యష్మీ. ఇక తర్వాత కాసేపు సీత, నైనిక ఇద్దరూ మణికంఠపై ఫైర్ అయ్యారు.
దీంతో యష్మీ మరింత రెచ్చిపోయింది. అసలు హౌస్ లో మణికంఠకు చీఫ్ అయ్యే అర్హతే లేదంటూ సీరియస్ కావడంతో.. ఏదోక రోజు చీఫ్ అవుతానంటూ సవాల్ విసిరాడు మణి. ఎట్లా ఆడతావో నేను కూడా చూస్తాను.. చీఫ్ అవ్వు అంటూ యష్మీ కూడా సవాల్ విసిరింది. ఇక మొదటి నుంచి మణికంఠ వర్సెస్ యష్మి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ లో హౌస్ లో ఉన్నన్ని రోజులు మణికంఠను నామినేట్ చేస్తుంటా అని ముందే చెప్పేసింది యష్మీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.