బిగ్ బాస్ హౌస్ లో నిన్నటి ఎపిసోడ్ లో ముందుగా విష్ణు ప్రియకు, యష్మీ కి మధ్య గేమ్ జరిగింది. ఇందుకోసం బోర్డుపై ఉన్న స్క్రూలను తీసి వాటిలో ఒకే కలర్ ఉన్న లైన్లో పెట్టాలి. ఈ టాస్క్ లో యష్మీ గెలిచింది. గెలిచినా యష్మీ తనదగ్గరున్న సూట్ కేసును ఓపన్ చేసింది. అందులో రూ.75వేలు ఉన్నాయి. దాంతో ఆ ప్రైజ్ మని యాడ్ అయ్యింది. ఆతర్వాత బిగ్ బాస్ విష్ణు ప్రియా, యష్మీల దగ్గరున్న సూట్ కేసును స్టోర్ రూమ్ లోపెట్టామన్నారు. తీరా చూస్తే విష్ణు ప్రియా సూట్ కేసు కనిపించదు. మ్యాటర్ ఏంటంటే.. గౌతమ్ అండ్ గ్యాంగ్ యష్మీ సూట్ కేసును కొట్టేశారు. అయితే విష్ణు ప్రియా సూట్ కేసును తనది అనుకోని యష్మీ ఓపెన్ చేసి చూసింది. తీరా దొరికిన సూట్ కేస్ ఓపెన్ చేసి చూడగా అందులో రూ.లక్ష 80 ఉన్నాయి.
ఇదంతా చేసింది అవినాష్ అని అందరూ ఇరికించారు. ఆతర్వాత ఎవరి సూట్ కేసో తెలియకుండా ఓపెన్ చేసిన యష్మీ పై సీరియస్ అయ్యారు హౌస్ మేట్స్. ఆ తర్వాత విష్ణు ప్రియా పృథ్వీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. పృథ్వీ నీతో మాట్లాడుతున్నాడు.. నాతో సరిగా మాట్లాడట్లేదు.. నాకు అయితే క్లారిటీ వచ్చేసిందిరా.. ఊరికే డంబ్ అని.. ఒక వ్యక్తిని హర్ట్ చేశాడని అతనికి ఐడియా ఉండి కూడా సారీ చెప్పట్లేదు.. అని విష్ణు ప్రియా అంది.
నన్ను ఫ్లిప్ అన్నాడురా.. వాడు ఏదో టెన్షన్లో ఉన్నాడేమో అంటూ యష్మీ పృథ్వీకి సపోర్ట్ చేసింది. వాడు టెన్షన్ తీసుకొని వేరే వాళ్లని హర్ట్ చేసేసి.. తను మాత్రం కూల్‌గా ఎంజాయ్ చేస్తున్న వ్యక్తి నా దృష్టిలో రెడ్ ఫ్లాగ్‌లాంటి వాడు.. నాకు వద్దు.. అని విష్ణు ప్రియా అంది. ఆతర్వాత పృథ్వీని పిలిచి విష్ణుకు సారి చెప్పమంది యష్మీ. కానీ సారీ లేదు.. ఏం లేదు అంటూ పృథ్వీ చెప్పాడు. పృథ్వీ అనే వ్యక్తే లేడు ఇంక.. అంటూ విష్ణు కోపంగా అంది. ఆతర్వాత పృథ్వీ దగ్గరికెళ్లింది విష్ణు. వెంటనే విష్ణుకు సారి చెప్పాడు పృథ్వీ. ఆతర్వాత ఇద్దరూ ఒకరికొకరు సారీ చెప్పుకొని మళ్లీ కలిసిపోయారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.