
బిగ్ బాస్ సీజన్ 10 మొదలైపోయింది. సీజన్ 10 ప్రారంభం అయ్యింది. ఈ సీజన్ మరింత ఆసక్తికరంగా ఉండనుంది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తోన్న బిగ్ బాస్ కొత్త సీజన్ కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగులో విజయవంతంగా తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఇప్పుడు పదో సీజన్ కోసం అట్టహాసంగా ముస్తాబైంది. ఇవాళ (సెప్టెంబర్ 06) సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అధికారికంగా అయ్యింది. ల్యాండ్ మార్క్ సీజన్ కావడంతో ఈసారి ఈ రియాలిటీ షోపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక బిగ్ బాస్ 10 కంటెస్టెంట్స్ ఒకొక్కరుగా స్టేజ్ పైకి వస్తున్నారు. ఈసారి కూడా సామాన్యులకు పెద్ద పీట వేశారు బిగ్ బాస్ టీమ్. ఇప్పటికే అగ్ని పరీక్ష ద్వారా కొందరిని సెలక్ట్ చేసి హౌస్ లోకి పంపించనున్నారు. వారు కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. అలాగే వారిలో కొందరిని ఇప్పుడు హౌస్ లోకి పంపించనున్నారు. ఫోక్ సింగర్ జాన్సీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. గోల్డెన్ టికెట్ గెలుచుకొని డైరెక్ట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సెలక్ట్ అయ్యింది జాన్సీ. అలాగే మరికొంతమంది కామాన్సర్, సెలబ్రెటీలు కూడా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
హౌస్ లోకి మొత్తం 16మంది ఎంట్రీ ఇచ్చారు. 10 మంది సెలబ్రెటీలు ఆరుగురు కామనర్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆతర్వాత బిగ్ బాస్ హౌస్ కు తాళం వేశారు నాగార్జున
చివరి నలుగురికి మ్యాజిక్ కీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. గెలిచిన వారికి మ్యాజిక్ కీ దక్కుతుందని చెప్పారు. ఈ టాస్క్ లో వర్షిణి, రోహిత్ మ్యాజిక్ కీ సొంతం చేసుకున్నారు
మొత్తంగా 16మంది హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ 16మందికి రకరకాల టాస్క్ లతో ముందు ముందు మహా పరీక్షా ఉంటుందని నాగ్ చెప్పారు
సీరియల్ నటుడు ముఖేష్ చివరి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టాడు. అదిరిపోయే డాన్స్ తో ముఖేష్ ఎంట్రీ ఇచ్చాడు
రోహిత్‌కు టాస్క్ ఇచ్చారు నాగార్జున.. ఒక గ్లాస్ లో వాటర్ ఇచ్చి ఎవరి పైనైనా పోయామని టాస్క్ ఇచ్చారు నాగ్.
జ్యురీ మెంబర్ ద్వారా ఆడియన్స్ ఓట్లు ప్రకారం బిందు మాధవి రోహిత్ ను హౌస్ లోకి తీసుకొచ్చారు. చివరి కామనర్ గా రోహిత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
బిగ్ బాస్ స్టేజ్ పై వర్షిణికి టాస్క్ ఇచ్చారు నాగార్జున..
అందాల బ్యూటీ యాంకర్ వర్షిణి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆకట్టుకునే డాన్స్ పర్ఫామెన్స్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది వర్షిణి
నటుడు కృష్ణుడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. వినాయకుడు, విలేజ్ లో వినాయకుడు అనే సినిమాలో హీరోగా నటించాడు నటుడు కృష్ణుడు
నరేష్, చరణ్, సృష్టి టాస్క్‌లో పాల్గొన్నారు. ఈ టాస్క్ లో నరేష్, సృష్టి విన్నర్స్ గా నిలిచారు. ఇద్దరికీ మ్యాజిక్ కీ సొంతం చేసుకున్నారు.
నరేష్, సృష్టి, వంశీ, చరణ్ కు మ్యాజిక్ కీ టాస్క్ ఇచ్చాడు నాగ్. ఇందులో గెలిచిన వారికి మ్యాజిక్ కీ సొంతం చేసుకునే టాస్క్ ఇచ్చారు నాగ్
ఆడియన్స్ ఓట్స్ ద్వారా చరణ్ బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అగ్నిపరీక్ష సీజన్ 2లో అదరగొట్టాడు చరణ్ ఇప్పుడు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
నరేష్ ను బాక్స్‌లో పెట్టి హౌస్‌లోకి పంపించారు నాగార్జున.. హౌస్ లోకి వచ్చిన బాక్స్ పై ఓ పజిల్ పెట్టి దాన్ని పూర్తి చేస్తే ఓ కీ దొరికిద్దని. ఆ కీ తో బాక్స్ ఓపెన్ చేస్తే సర్ ప్రైజ్ ఉంటుందని లెటర్ రాసారు. హౌస్ మేట్స్ ఆ కీ తో బాక్స్ ను ఓపెన్ చేయగానే నరేష్ ను చూసి షాక్ అయ్యారు.
కచ్చితంగా కప్పు కొడతా అని నరేష్ తెలిపాడు. అలాగే గూగుల్ లో తన పేరు కొడితే బిగ్ బాస్ నరేష్ అని రావాలని.. హౌస్ లో ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని నరేష్ తెలిపాడు.
11వ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన జబర్దస్త్ నరేష్. అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్తో బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చాడు నరేష్
10వ కంటెస్టెంట్‌గా సృష్టి వ్యాకరణం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. స్టేజ్ పై తన మాటలతో , చలాకీ తనంతో సందడి చేసింది శ్రీముఖి.
డాన్స్ తో అదరగొట్టిన టెంపర్ వంశీ.. నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి సాంగ్స్ కు స్టెప్పులేసి టెంపర్ వంశీ
సినిమాల్లో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించిన టెంపర్ వంశీ.. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఇచ్చిన బాల్ టాస్క్ ను పూర్తి చేసి మ్యాజిక్ కీ సొంతం చేసుకున్నాడు రామ్ ప్రసాద్. అలాగే షాలిని మ్యాజిక్ కీ సొంతం చేసుకున్నారు.
మ్యాజిక్ కీ దక్కించుకోవడానికి మరో ముగ్గురిని టాస్క్ ఇచ్చారు నాగ్. రామ్ ప్రసాద్, చైత్ర, షాలిని ఈ టాస్క్ లో పాల్గొన్నారు.
అగ్నిపరీక్ష జోన్లోకి ఎంట్రీ ఇచ్చిన నవదీప్ షాలిని సెలక్ట్ చేశాడు. బిగ్ బాస్ స్టేజ్‌పై తన మాటలతో అలరించింది షాలిని. 8 కంటెస్టెంట్ గా షాలిని హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
రామ్ ప్రసాద్ కు టాస్క్ ఇచ్చిన నాగార్జున. హౌస్ మేట్స్ మాట్లాడుకుంటున్న దాన్ని లిప్ రీడింగ్ ఇచ్చిన రామ్ ప్రసాద్. అయితే రామ్ ప్రసాద్ కు షాక్ ఇచ్చారు నాగ్. నన్ను ఎంటర్టైన్ చేయలేదు కాబట్టి రామ్ ప్రసాద్ ను బయటకు వెళ్లిపోవాలని చెప్పారు నాగ్.. దాంతో రామ్ ప్రసాద్ షాక్ అయ్యాడు.
జబర్దస్త్ రామ్ ప్రసాద్ 7 కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అదిరిపోయే డాన్స్ పర్ఫామెన్స్ తో హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ ప్రసాద్
సీరియల్ నటి చైత్ర రాయ్. సీరియల్స్ ద్వారా పాపులర్ అయినా ఈ చిన్నది ఇప్పుడు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు ఎస్జే సూర్య, కార్తీ. సర్ధార్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిగ్ బాస్ స్టేజ్ పై ఎస్జే సూర్య, కార్తీ సందడి చేశారు.
హౌస్‌లో వచ్చే ముగ్గురిలో ఒక్కరికైనా రెడ్ కలర్ డాట్ అంటించాలని టాస్క్ ఇచ్చారు నాగ్. అలాగే అమన్ కు వైట్ గోల్డ్ తరపున గోల్డ్ మెడల్ ఇచ్చారు నాగ్.
ఆడియన్స్ ఓటింగ్ ద్వారా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు కామనర్ అమన్.
ఓ పజిల్ టాస్క్ ఇచ్చారు నాగ్ . ఒక బాక్స్ లో ట్రయాంగిల్స్ పెట్టి వాటిని పజిల్ గా చేయాలని చెప్పారు. దాంతో అందరూ పజిల్ పెట్టె పనిలో పడ్డారు. నలుగురిలో ముందుగా త్రిగుణ్ పజిల్ పూర్తి చేశాడు. ఆతర్వాత ఝాన్సీ పజిల్ ను పూర్తి చేశారు.
నలుగురు కంటెస్టెంట్స్‌తో టీవీ ద్వారా మాట్లాడిన నాగార్జున. నలుగురిని హౌస్ లో టాస్క్ ఇచ్చారు నాగ్. మ్యాజిక్ కీ కోసం టాస్క్ ఇచ్చారు. నలుగురిలో ఇద్దరికీ మాత్రమే మ్యాజిక్ కీ దక్కుతుందని టాక్ ఇచ్చారు నాగ్.
యూట్యూబ్ లో ఇంటర్వ్యూస్ ద్వారా పాపులర్ అయిన సుధీర్ రెడ్డి నాలుగో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు. సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నా అని తెలిపాడు సుధీర్ రెడ్డి.
బిగ్ బాస్ ద్వారా కోట్ల మందికి పరిచయం అవ్వాలని ఉందని జాన్సీ తెలిపారు. అలాగే మూడో తరగతి నుంచే పాటలు పాడటం మొదలు పెట్టా అని తెలిపింది జాన్సీ. అలాగే ఈ టాలెంట్ కు బిగ్ బాస్ హెల్ప్ అవుతుందని తెలిపింది జాన్సీ.
బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చిన సింగర్ జాన్సీ, గోల్డెన్ టికెట్ ద్వారా డైరెక్ట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్న జాన్సీ. స్టేజ్ పై ఎమోషనల్ సాంగ్ పాడి అందరిని ఆకట్టుకుంది జాన్సీ.
గోల్డెన్ టికెట్ సొంతం చేసుకున్న జాన్సీకి కంగ్రాట్స్ చెప్పారు నాగార్జున, అలాగే అందరితో మాట్లాడి పలకరించారు నాగార్జున.
అగ్నిపరీక్ష సీజన్ 2 కంటెస్టెంట్స్ ను వాళ్ల జర్నీ చూపించారు నాగ్. అలాగే కామనర్స్ 13 మందితో మాట్లాడారు నాగార్జున.
కవిత్వంతో మెప్పించిన త్రిగుణ్. అలాగే త్రిగుణ్ కు టాస్క్ ఇచ్చారు నాగ్. హౌస్ లో ముగ్గురిని దెయ్యం ఉందని నమ్మించమని చెప్పారు నాగ్.
రెండో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన త్రిగుణ్, పలు సినిమాల్లో సహాయక పాత్రల్లో నటించి మెప్పించాడు త్రిగుణ్
హౌస్ లోకి దేబ్జానీ మోదక్ ఎంట్రీ ఇచ్చింది. హౌస్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యింది ఈ సీరియల్ భామ
హౌస్ లో వచ్చిన వారికి ఒకొక్కరికి బ్యాడ్జ్ లు పెట్టాలి.. శనివారంలోగా బ్యాడ్జ్ లు పెట్టాలని నాగ్ టాస్క్ ఇచ్చారు. అలాగే క్యూట్ గా తెలుగులో మన్మధుడు సాంగ్ పాడిన దేబ్జానీ మోదక్.
వచ్చి రాని తెలుగులో క్యూట్ గా మాట్లాడిన దేబ్జానీ మోదక్. తన మాటలతో ఆడియన్స్ ను నవ్వించిన దేబ్జానీ మోదక్. తాను డే డ్రీమర్ అని తెలిపింది. హౌస్ లో అందరితో కలిసిపోతానని తెలిపింది. అలాగే హౌస్ లో అందరం ఫ్యామిలీ లా కలిసిపోతామని చెప్పింది దేబ్జానీ మోదక్
సీరియల్ నటి దేబ్జానీ మోదక్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆకట్టుకునే డాన్స్ తో ఎంట్రీ ఇచ్చింది దేబ్జానీ మోదక్.
మలయాళం మోహన్ లాల్, కన్నడ సుదీప్, తమిళ్ విజయ్ సేతుపతితో వీడియో ద్వారా మాట్లాడారు నాగార్జున. అందరికీ అందరూ ఆల్ ది బెస్ట్ లు చెప్పుకున్నారు.
బిగ్ బాస్‌తో నాగ్ మాట్లాడారు. ఈసారి టెన్ ఆన్ టెన్ ఉంటుందని నాగార్జున బిగ్ బాస్ కు తెలిపారు.
ప్రకృతి థీమ్‌తో హౌస్‌ను డిజైన్ చేశారు. అలాగే హౌస్ లో ఓ రోబో దర్శనమిచ్చింది. దాంతో కొంత సేపు మాట్లాడిన నాగ్. ఆతర్వాత హౌస్ మొత్తం తిరిగి చూపించారు నాగార్జున
ఈసారి మరింత ఆసక్తిగా మరింత కొత్తగా ఉండనుందని కింగ్ నాగార్జున అన్నారు. అలాగే ఓ కీ చూపించి హౌస్ లోని వారి తల రాతలు మారుస్తుందని తెలిపారు నాగార్జున
సీజన్ 10 మొదలైంది.. హోస్ట్ కింగ్ నాగార్జున చేతిలో గొడ్డలితో మాస్ అండ్ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు.
ఈరోజు బిగ్ బాస్ చరిత్రలోనే ఓ స్పెషల్ .. ఒకేసారి నాలుగు భాషల్లో బిగ్ బాస్ గేమ్ షో ప్రారంభం కానుంది., సుదీప్ హోస్ట్ చేస్తున్న కన్నడ బిగ్ బాస్, మోహన్ లాల్ హోస్ట్ చేస్తున్న మలయాళం బిగ్ బాస్, అలాగే తమిళ్ హీరో విజయ్ సేతుపతి హోస్ట్ చేస్తున్న తమిళ్ బిగ్ బాస్ తో పాటు మన తెలుగు బిగ్ బాస్ కూడా ఈరోజే ప్రారంభం కానుంది.
బిగ్ బాస్ సీజన్ 10కు తొలి గెస్ట్ గా హీరో కార్తీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కార్తితో పాటు దర్శకుడు, నటుడు ఎస్ జే సూర్య ఎంట్రీ ఇవ్వనున్నారు. సర్ధార్ 2 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఇద్దరూ బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేయనున్నారు
బిగ్ బాస్ సీజన్ 10 ఈసారి మరింత ఆసక్తికరంగా ఉండనుంది. మైల్ స్టోన్ సీజన్ కావడంతో అదిరిపోయే సర్ ప్రైజ్ లు ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్