
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ హౌస్ ఎప్పటికప్పుడు కొత్త మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. గత వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. అసలైతే షాలిని హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి ఉండగా.. బిగ్‌బాస్ ఆమెను సీక్రెట్ రూమ్‌కి పంపించారు. ఆ తర్వాత నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత షాలిని తిరిగి హౌస్‌లోకి తీసుకురావడంతో ఈ వారం ఆమె నామినేషన్ల నుంచి సేవ్ అయిపొయింది. షాలిని గత వారం ఎలిమినేట్ కాకపోవడంతో, ఈ వారం హౌస్‌లో డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉందనే చర్చ జోరుగా సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే మొదటి వికెట్ పడిపోయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వారానికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియలో పలువురు కంటెస్టెంట్లు ప్రమాదంలో చిక్కుకున్నారు.
నామినేషన్లలో ఉన్న సభ్యులు: రోహిత్, త్రిగుణ్, రామకృష్ణ, అమన్, శ్వేత నాయుడు, వర్షిణి, వంశీ, సుధీర్, ఝాన్సీ, శివ, దక్షి, నీతూ మాస్టర్. హౌస్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘గోట్’ టాస్క్‌లో గెలిచిన అమన్, త్రిగుణ్, ముకేశ్, దేబ్జానీ, నీతూ మాస్టర్లు ఈ వారంతో పాటు వచ్చే వారం కూడా నామినేషన్ల నుంచి పూర్తిగా సేవ్ అయ్యారు. అలరించడానికి వచ్చిన కంటెస్టెంట్లకు సంబంధించి తాజా ఓటింగ్ సరళి చూస్తే ఆసక్తికరమైన విషయాలు వెల్లడవుతున్నాయి. ఓటింగ్ పరంగా రోహిత్ మొదటి స్థానంలో దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. ఆయన తర్వాతి స్థానాల్లో త్రిగుణ్, రామకృష్ణ, అమన్, ఝాన్సీ, వర్షిణి, సుధీర్, వంశీ వరుస క్రమంలో కొనసాగుతున్నారు. ఇక ఓటింగ్‌లో చివరి స్థానాల్లో శ్వేత నాయుడు, నీతూ మాస్టర్, దక్షి, శివ నిలిచారు. అయితే, నీతూ మాస్టర్ ఇప్పటికే గోట్ టాస్క్ ద్వారా సేవ్ అయిపోవడంతో ఆ టెన్షన్ నుంచి బయటపడ్డారు.
ప్రస్తుతానికి శివ, దక్షి, శ్వేత నాయుడు డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్లలో సోషల్ మీడియా సమాచారం ప్రకారం దక్షి తొలి ఎలిమినేషన్‌గా హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గత వారం షాలిని ఎలిమినేట్ కాకపోవడంతో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మరి ఈ వీకెండ్ ఎపిసోడ్లో హోస్ట్ కేవలం దక్షి ఎలిమినేషన్‌తోనే సరిపెడతారా.? లేదంటా డేంజర్ జోన్లో ఉన్న మరో కంటెస్టెంట్‌ను కూడా బయటకు పంపి మరో ఎలిమినేషన్ సర్ప్రైజ్ ఇస్తారా అనేది చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.