ఈ సారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో చాలా మంది సినీ సెలబ్రెటీలు పోటీచేశారు. వెండితెర, బుల్లితెరపై నటించిన చాలా మంది ఈసారి ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వివిధ పార్టీల తరపున పోటీలోకి దిగారు సినీ సెలబ్రిటీలు. ఈసారి జరిగిన ఎన్నికల్లో చాలా మంది సినీ తారలు విజయం సాధించారు. కంగనా రనౌత్, అరుణ్ గోవిల్, డ్రీమ్ గర్ల్ హేమమాలిని, మనోజ్ తివారీ, మలయాళ నటుడు సురేష్ గోపీ, రేసు గుర్రం విలన్ రవికిషన్ అలాగే నవనీత్ కౌర్, స్మృతి ఇరానీ, రాధిక వంటి నటీమణులు కూడా ఈసారి ఎన్నికల్లో పోటీచేశారు. కాగా వీరిలో కంగనా రనౌత్, అరుణ్ గోవిల్, డ్రీమ్ గర్ల్ హేమమాలిని, మనోజ్ తివారీ, సురేష్ గోపి, రవికిషన్ విజయం సాధించారు. అలాగే పశ్చిమ బెంగాల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సినీ నటులు పోటీ చేశారు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసింది ఆమె ఎవరో కనిపెట్టారా.?
పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించింది. ఇంతకు ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? మెగాస్టార్ చిరంజీవితో కూడా నటించింది ఆ అమ్మడు. టాలీవుడ్ లో ఏకంగా ఐదేళ్ల పాటు సినిమాలు చేసి అలరించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు ఎంపీగా విజయం సాధించింది లోక్ సభలో అడుగుపెట్టనుంది. ఇంతకు ఆమె ఎవరంటే..
పై ఫొటోలో కనిపిస్తున్న నటి మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి నటించిన బావగారు బాగున్నారా సినిమాలో నటించిన నటి రచన బెనర్జీ. ఈ అమ్మడు హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. నేను ప్రేమిస్తున్నా సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన అర్చన. ఆతర్వాత శ్రీకాంత్ , ఉపేంద్ర కలిసి నటించిన కన్యాదానం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రచన. ఆతర్వాత రాయుడు, మావిడాకులు, అభిషేకం, బావగారు బాగున్నారా , పిల్ల నచ్చింది, సుల్తాన్, పెద్ద మనుషులు, అంతా మన మంచికే, నీతో వస్తాను, లాహిరి లాహిరీ లాహిరీ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ అమ్మడు. ఆ తర్వాత టాలీవుడ్ కు దూరం అయ్యింది. ఆతర్వాత పెళ్లి చేసుకొని, ఆతర్వాత విడాకులు తీసుకుంది ఈ చిన్నది. అప్పటి నుంచి సింగిల్ గా ఉంటుంది ఈ అమ్మడు. ఇక ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టింది. ఇప్పుడు ఎంపీగా విజయం సాధించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.