Udaya Bhanu: మీరే నా బలం.. మీరే నా సపోర్ట్.. అంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఉదయభాను..! వీడియో వైరల్
ఒకప్పుడు యాంకర్ గా తెలుగు బుల్లితెరను ఏలింది ఉదయ భాను. తనదైన అందం, ఎనర్జీ, మాట తీరుతో ఎన్నో టీవీ షోలను రక్తి కట్టించింది. వన్స్ మోర్ ప్లీజ్, సాహసం చేయరా డింభకా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రేలారే, ఢీ, జాణవులే నెరజాణవులే, పిల్లలు, పిడుగులు.. ఇలా ఎన్నో సూపర్ హిట్ టీవీషోలకు యాంకర్ గా చేసింది ఉదయ భాను.

ఒకప్పుడు స్టార్ యాంకర్స్ అంటే ముందు వరసలోవినిపించే పేర్లు సుమ, ఝాన్సీ, ఉదయభాను. ఈ ముగ్గురు యాంకర్స్ తమ దైన స్టైల్ లో యాంకరింగ్ చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేవారు. టీవీలో ఏ ప్రోగ్రాం టెలికాస్ట్ అయినా ఈ ముగ్గురే కనిపించే వారు. వీరిలో ఉదయభానుకు మంచి క్రేజ్ ఉండేది. ఈ స్టార్ యాంకర్ చాలా మంది ఫేవరెట్ అనే చెప్పాలి.. ఎన్నో సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ కు ఉదయభాను యాంకర్ గా వ్యవహరించారు. ఉదయభాను చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆర్. నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ‘ఎర్రసైన్యం’ సినిమాతో నటిగా ఆమె కెరీర్ ప్రారంభమైంది. ఈటీవీలో వచ్చిన హృదయాంజలి షో ఆమెకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘ఫ్యామిలీ సర్కస్’, ‘ఢీ’ (డ్యాన్స్ షో), ‘జాక్‌పాట్’, ‘సాహసం చేయరా డింభకా’ వంటి ఎన్నో సూపర్ హిట్ షోలకు ఆమె హోస్ట్‌గా వ్యవహరించారు.
B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్
టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటించారు ఉదయభాను. స్పెషల్ సాంగ్స్ లోనూ మెప్పించారు ఈ స్టార్ యాంకర్. చాలా రోజులుగా ఉదయభాను సినిమాలకు టీవీ షోలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవలే రీ ఎంట్రీ ఇచ్చి వరుసగా సినిమాలు చేస్తున్నారు. స్పెషల్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది ఉదయభాను. ఇటీవలే ఉదయభాను కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. నిర్మాతగా మారి తన తొలి నిర్మాణంలో ‘పంచనామా’ అనే చిత్రాన్ని నిర్మించారు ఉదయభాను.
అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న పంచనామా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఓటీటీలో ఈ సినిమాకు మంచి రెస్పాండ్స్ వస్తుంది. ఈ సక్సెస్ తో ఉదయభాను ఎమోషనల్ అయ్యారు. ప్రేక్షకులు తన సినిమాను ఆదరిస్తున్నారని చెప్తూ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నారు ఉదయభాను. “ఈరోజు పంచనామా సినిమాకు మీరు ఇస్తున్న అప్రిసియేషన్ చూస్తుంటే నాకు మాటలు రావట్లేదు. అందరికీ చాలా కృతజ్ఞతలు. మీరే నా బలం.. మీరే నా సపోర్ట్.. ఉదయభాను ప్రొడక్షన్స్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్లు చేస్తోంది.. కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ సినిమాలు చేస్తుంటా.. ముందు మీకు మంచి మంచి ప్రాజెక్ట్లను అందిస్తాం.. ఇది కేవలం ఆరంభం మాత్రమే ఇక ముందు మీకు మంచి మంచి ప్రాజెక్ట్లను అందిస్తాం అంటూ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




