Anasuya Bharadwaj: “నేను గొర్రెల మంద టైప్ కాదు”.. అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు

|

Aug 14, 2022 | 2:54 PM

బుల్లితెర పై తన అందంతో వాక్చాతుర్యంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అనసూయ. తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకుంటూ స్టార్ యాంకర్ గా రాణిస్తోంది అనసూయ(Anasuya).

Anasuya Bharadwaj: నేను గొర్రెల మంద టైప్ కాదు.. అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు
Anasuya Bharadwaj
Follow us on

బుల్లితెర పై తన అందంతో వాక్చాతుర్యంతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అనసూయ. తనదైన యాంకరింగ్ తో ఆకట్టుకుంటూ స్టార్ యాంకర్ గా రాణిస్తోంది అనసూయ(Anasuya). ఇక ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ హోస్ట్ చేస్తుందంటే టీవీలకు అతుక్కుపోయే అభిమానులున్నారంటే అనసూయ క్రేజ్ ఏంటో అర్ధమవుతోంది. ఇక అనసూయ జబర్దస్త్ షో వల్ల బాగా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఎంతో విజయవంతగా ఇన్ని రోజులు జబర్దస్త్ ను నడిపించిన అనసూయ సడన్ గా ఆ షో నుంచి తప్పుకోవడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. అనసూయ షో మానేయడానికి కారణం ఏంటి అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆమె మానేశారా..? లేక సినిమాలతో బిజీ అవ్వడం వల్ల మానేశారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

దాదాపు తొమ్మిదేళ్లుగా అనసూయ ఈ కామెడి షోకి హోస్ట్ గా వ్యవహరిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారం పై స్పందించింది అనసూయ.. రెండేళ్ల నుంచే  బయటకు రావాలని చూస్తున్నా..  నాపై వేసే పంచులు నచ్చక సీరియస్‌ అయ్యా కూడా… నాకు బాడీ షేమింగ్‌, పిచ్చిపిచ్చి చేష్టలు నచ్చవు. పంచులు నచ్చక చాలా సార్లు ఇబ్బందిపడ్డా.. క్రియేటివ్‌ ఫీల్డ్‌ అన్న తర్వాత ఇవన్నీ తప్పవు.. కానీ నేను మాత్రం అందులో చిక్కుకోవాలని అనుకోవడం లేదు. అలాగే నాగబాబు, రోజాగారు వెళ్లిపోయారు కాబట్టే నేను కూడా వెళ్లిపోతున్నాను అనే ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. నేనేమి గొర్రెల మంద టైప్ కాదు. ప్రస్తుతం నా ఫోకస్‌ అంతా సినిమాపైనే పెట్టాలనుకుంటున్నా అని చెప్పుకొచ్చింది అనసూయ. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న గాడ్ ఫాదర్ సినిమాలో, అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2లో నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి