
దేశమంతటా శ్రీరామనవవి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భద్రాచలం, ఒంటిమిట్ట, శ్రీశైలం వంటి ప్రధాన ఆలయాలతో పాటు చిన్న చిన్న దేవాలయాల్లోనూ విశిష్ట పూజలు, కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాములోరి కల్యాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇదే నేపథ్యంలో ఓ గుడిలో కొలువైన శ్రీరాముడి విగ్రహం ఫొటో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో విశేషమేముంది? అనుకుంటున్నారా? ఈ రాములోరి విగ్రహం అచ్చం సూపర్ స్టార్ మహేష్ బాబు లాగా ఉంది. ఒక నెటిజన్ ఈ ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘15 ఏళ్ల క్రితం ఆంధ్రాలో ఎక్కడో గుడిలోని రాముడు.. అచ్చం మహేశ్ బాబులాగే కనిపిస్తున్నాడు’ కదా అని రాసుకొచ్చాడు. అయితే ఆ గుడి ఎక్కడుందో క్లియర్ గా చెప్పలేకపోయాడు. దీంతో ఈ ఫొటో నెట్టింట వైర ల్ గ మారింది. దీనిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. అది నిజమైన విగ్రహం కాదని, ఒకవేళ నిజంగానే ఉంటే.. ఈ పాటికే అందరికి తెలిసిపోయేది కదా? అని కామెంట్లు చేస్తున్నారు. కేవలం వ్యూస్, రీచ్ కోసమే ఇలాంటి ఏఐ ఫోటోలను షేర్ చేస్తున్నారంటూ మరికొంత మంది నెటిజన్స్ మండిపడుతున్నారు.
అయితే మహేశ్ బాబాబు అభిమానులు మాత్రం శ్రీరాముడిగా కనిపిస్తున్న తమ హీరోని చూసుకొని మురిసిపోతున్నారు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న వారణాసి సినిమాలో మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించనున్నాడు. సుమారు రూ. 1000 కోట్ల బడ్జెట్ లో హాలీవుడ్ రేంజ్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహేశ్ బాబు సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న వారణాసి సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్ బాబును పోలిన రాముడి విగ్రహం వైరల్ కావడానికి వారణసి సినిమా కూడా ఒక కారణమని చెప్పవచ్చు.
15 years back andhra lo ekkado gudilo
RamuduMahesh lage kanipisthunadu kada pic.twitter.com/zI3KXBExN0
— 000009 (@ui000009) March 27, 2026
THANK YOU EVERYONE for all the love, accolades and applause for the #Varanasi Announcement Video. Our whole @VaranasiMovie team is grateful to all of you. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 pic.twitter.com/IkjWle0gm5
— rajamouli ss (@ssrajamouli) November 16, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.