Allu Arjun: దసరా చిత్రయూనిట్ అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్.. ధరణిపై పుష్పరాజ్ ప్రశంసలు..

సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం సైతం ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఈ మూవీ సాంగ్స్ తెగ వైరలయ్యాయి. ఇక ఈ సినిమా చూసిన సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దసరా చిత్రయూనిట్ పై పొగడ్తల వర్షం కురిపించగా.. తాజాగా అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Allu Arjun: దసరా చిత్రయూనిట్ అల్లు అర్జున్ ఆసక్తికర కామెంట్స్.. ధరణిపై పుష్పరాజ్ ప్రశంసలు..
Allu Arjun, Nani
Follow us

|

Updated on: Apr 17, 2023 | 12:39 PM

దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు నాని. మాస్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ మూవీలో పక్కా ఊరమాస్ లుక్‏లో అదరగొట్టారు న్యాచురల్ స్టార్. ఇప్పటివరకు లవర్ బాయ్ గా ఇమేజ్ సంపాదించుకున్న నాని.. ఈ సినిమాతో మాస్ హీరోగానూ మెప్పించాడు. ఇక తొలి ప్రయత్నంలోనే బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయికగా నటించగా.. కన్నడ హీరో దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ కీలకపాత్రలలో నటించారు. మార్చి 30న విడుదలైన ఈ సినిమా రిలీజ్ అయిన పదిరోజుల్లో దాదాపు 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం సైతం ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఈ మూవీ సాంగ్స్ తెగ వైరలయ్యాయి. ఇక ఈ సినిమా చూసిన సామాన్యులే కాదు.. సినీ ప్రముఖులు చిత్రయూనిట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దసరా చిత్రయూనిట్ పై పొగడ్తల వర్షం కురిపించగా.. తాజాగా అల్లు అర్జున్ ఆసక్తికర ట్వీట్ చేశారు.

దసరా చిత్రయూనిట్ మొత్తాన్ని అభినందించారు బన్నీ. “దసరా టీమ్ మొత్తానికి అభినందనలు. నాని నటన అద్భుతం. కీర్తిసురేష్.. మిగతా యూనిట్ సభ్యుల నటన బాగుంది. సంతోష్ నారయణన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. సత్యన్ అద్భుతమైన కెమెరా పనితనం. అంతేకాకుండా ఈ సినిమాను ఇంత అద్భుతంగా తీసిన కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల డెబ్యూ డైరెక్టర్ గా తనను తాను అధిగమించాడు. నిర్మాతలకు ఆల్ ది బెస్ట్” అంటూ ట్వీట్ చేశారు బన్నీ.

ఇవి కూడా చదవండి

థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్నింగ్ అయిన ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రిమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.