పుత్తడి బొమ్మలా మెరిసిన .. క్యూట్ బ్యూటీ నభా నటేష్ 

Rajeev 

07 August 2024

2018లో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది నభా నటేష్.

అంతకు ముందు కొన్ని కన్నడ సినిమాల్లో మెరిసిందీ అందాల తార. కానీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేదు. 

ఇక పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా ఈ అమ్మడు క్రేజ్ ను డబుల్ చేసింది. ఈ సినిమాతో హిట్ కొట్టింది. 

డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నటా నటేష్ అభినయానికి మంచి మార్కులు పడ్డాయి.

అయితే 2021 మ్యాస్ట్రో సినిమా తర్వాత ఉన్నట్లుండి సినిమాలకు దూరమైపోయింది నభా నటేష్. ఆ సమయంలో ప్రమాదానికి గురయ్యింది నభా.  

ఒక యాక్సిడెంట్ కారణంగా సుమారు మూడేళ్ల పాటు ఇంటికే పరిమితమైందీ అందాల ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు వరుస సినిమాలు చేస్తుంది. 

ఇటీవలే డార్లింగ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. సోషల్ మీడియాలో అందాలతో అదరగొడుతోంది.