తారక్ ఆలపించిన పాటలు ఇవే.. 

TV9 Telugu

07 August 2024

జూనియర్ ఎన్టీఆర్.. మల్టీ టాలెంటెడ్ హీరో.. ఆయన పేరు చెబితే గుర్తువచ్చేది డైలాగ్ డెలివరీ, అద్భుతమైన యాక్టింగ్.. డ్యాన్స్.

కేవలం డాన్స్, యాక్టింగ్ కాదు.. సింగర్‏గా మెప్పించారు. కొన్ని సినిమాల్లో ఎన్టీఆర్ పాడిన సాంగ్స్ ఏంటో తెలుసుకుందాం.

నాన్నకు ప్రేమతో సినిమాలో తారక్.. ఫాలో ఫాలో సాంగ్ ఆలపించారు. ఈ పాట హిట్ అయ్యింది. దీనికి డిఎస్పి మ్యూజిక్ అందించారు.

రాకాసి రాకాసి.. అనే పాటతో మరోసారి సింగర్‏గా అదరగొట్టారు. ఈ సాంగ్ రభస చిత్రంలోనిది. ఈ పాటకి తమన్ సంగీతం ఇచ్చారు.

చారీ (వేర్ ఈజ్ ది పంచకట్టు).. అనే పాటకు మరోసారి గాత్రం అందించారు. ఈ సాంగ్ అదుర్స్ మూవీలోనిది. దినికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్.

మణిశర్మ మ్యూజిక్ అందించిన కంత్రి సినిమాలో 1,2,3 నేనొక కంత్రి అనే పాటతో అలరించారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన యమదొంగ చిత్రంలోని ఓలమ్మి తిక్క రేగిందా సాంగ్ ఆలపించారు తారక్.

తెలుగు కాదు.. కన్నడలోనూ ఓ సాంగ్ పాడారు యంగ్ టైగర్. చక్రవ్యూహా అనే మూవీలో గెలేయా గెలీయా అనే సాంగ్ పాడారు.