Allu Arjun: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల సాయం.. ప్రకటించిన అల్లు అరవింద్..

|

Dec 25, 2024 | 3:13 PM

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజ్. అనంతరం అతడి కుటుంబానికి రూ.2 కోట్ల సాయం చేయనున్నట్లు ప్రకటించారు. కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను పరామర్శించిన అనంతరం ప్రకటించారు.

Allu Arjun: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్ల సాయం.. ప్రకటించిన అల్లు అరవింద్..
Dil Raju, Allu Aravind
Follow us on

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ను పరామర్శించారు నిర్మాత దిల్‌ రాజు, అల్లు అరవింద్, పుష్ప ప్రొడ్యుసర్‌ ఎలమంచిలి రవి. అనంతరం బాలుడు శ్రీతేజ్‌ తండ్రికి ధైర్యం చెప్పిన నిర్మాతలు.. అతడి కుటుంబానికి రూ.2 కోట్లు పరిహారం అందజేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ప్రస్తుతం కిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. అల్లు అర్జున్ తరపున రూ.1 కోటి, పుష్ప 2 నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ చెరో రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

బుధవారం ఎఫ్‏డీసీ ఛైర్మన్ దిల్ రాజు, పుష్ప 2 నిర్మాత రవిశంకర్ తో కలిసి అల్లు అరవింద్ కిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాలుడు తండ్రి భాస్కర్ తో మాట్లాడి అతడికి ధైర్యం చెప్పారు. అనంతరం అల్లు అరవింద్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే మైత్రీ మూవీస్ సంస్థ భారీ మొత్తంలో ఆర్థిక సహాయం చేసిన సంగతి తెలిసిందే.

డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. అదే ఘటనలో రేవతి కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతడిని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ విడుదల చేస్తున్నారు కిమ్స్ వైద్యులు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ కేసులో అల్లు అర్జున్ ను ఏ11 ముద్దాయిగా చేర్చారు. ఇప్పటికే జైలుకు వెళ్లిన బన్నీ.. మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చాడు. ఈ క్రమంలోనే డిసెంబర్ 24న మరోసారి చిక్కడపల్లి పోలీసులు విచారణకు పిలిచారు.

ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‏బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..

Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‏గా..

Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..

Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‏ను మించిన అందం.. ఎవరంటే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.