Allu Arjun: అభిమానులంటే ఇలా ఉండాలి.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

గత కొన్నాళ్లుగా వరుసగా సమావేశాలు పెట్టుకున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇకపై ప్రతి సంవత్సరం ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ అందరి మన్ననలు అందుకుంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఈ నేపథ్యంలో తన అభిమానులను చూసి బన్నీ కూడా ఎమోషనల్ అయ్యాడు.

Allu Arjun: అభిమానులంటే ఇలా ఉండాలి.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన పనికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే
Allu Arjun

Updated on: Apr 10, 2026 | 8:00 PM

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే భారతీయ సినిమా ఇండస్ట్రీలోనూ బన్నీకి మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు అతనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ క్రమంలో అభిమానం అనే పదానికి సరికొత్త నిర్వచనం చెబుతున్నారు బన్నీ ఫ్యాన్స్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఏటా ఒక మంచి పని చేపట్టాలన్న బన్నీ అభిమానుల నిర్ణయం తీసుకోవడం, ఇప్పుడు ఆ ఆలోచనను అమలులో పెట్టడంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కాగా ఈ ఏడాది బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు హెచ్ పీవీ వ్యాక్సిన్(HPV Vaccine) గురించి ప్రచారం చేస్తూ క్యాన్సర్ పట్ల అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఇటీవల కాలంలో సర్వైకల్ క్యాన్సర్స్ అధికమవుతున్న నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మహమ్మారిని అరికట్టడం కోసం హెచ్ పీవీ వ్యాక్సిన్ ను ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. 14 సంవత్సరాలు వయసున్న ప్రతి ఒక్క అమ్మాయి ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించింది. అయితే ఈ వ్యాక్సిన్ ను తీసుకోవడానికి కొంత మంది వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోహెచ్ పీవీ వ్యాక్సిన్ వ్యాక్సిన్ పట్ల అపోహలను తొలగిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు బన్నీ ఫ్యాన్స్.

ఈ క్రమంలో తన అభిమానులు చేపడుతోన్న మంచి పనులు చూసి అల్లు అర్జున్ కూడా ఎమోషనల్ అయ్యాడు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ‘ప్రతి సంవత్సరం ఒక మంచి పని అనే కార్యక్రమాన్ని స్వీకరించి.. ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించేలా ప్రోగ్రామ్స్ చేపట్టిన నా అభిమానులందరినీ చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను. మీరందరూ అద్భుతమైన పనులు చేస్తున్నారు. మీ ప్రతి కార్యాచరణ చూస్తుంటే నా హృదయం ఆనందంతో ఉప్పొంగి పోతోంది. మీ శక్తి అంతా మంచి పనులకే కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ చూసి నిజంగా గర్వపడుతున్నా. ఈ గొప్ప కార్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమ అమూల్యమైన మద్దతు, ప్రోత్సాహం అందించిన గౌరవనీయ మంత్రులు, నాయకులు, ప్రభుత్వ అధికారులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. ప్రజల్లో శాశ్వతమైన సానుకూల ప్రభావాన్ని సృష్టించే కార్యక్రమాల కోసం మనమందరం కలిసికట్టుగా నిలబడదాం’ అని రాసుకొచ్చారు అల్లు అర్జున్.

ఇవి కూడా చదవండి

హెచ్ పీవీ వ్యాక్సిన్ అవగాహనా కార్యక్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్..

 

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. బన్నీ అభిమానులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us