
చాలా కాలం అక్కినేని సుమంత్ ప్రధాన పాత్రలో.. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మళ్లీ మొదలైంది. ఇటీవల ఈ మూవీ నుంచి లీకైన శుభలేఖతో కావాల్సినంత పబ్లిసిటీ ముందుగానే వచ్చింది. అయితే సుమంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ నెట్టింట్లో వార్తలు రావడంతో క్లారిటీ ఇస్తూ.. ఈ సినిమాను అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారా విడాకుల తర్వాత తమ జీవితాన్ని ఎలా ఉందనేది ఇందులో చూపించబోతున్నామని చెప్పి ఈ సినిమాపై మరింత ఆసక్తిని కలిగించారు. తాజాగా హీరో సుమంత్ లుక్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్.
తాజాగా విడుదలైన పోస్టర్లో సుమంత్ గ్రీన్ టీ షర్ట్‌లో క్లాస్‌గా కనిపిస్తున్నాడు. విడాకులు తీసుకున్న మోస్ట్ కన్ఫ్యూజ్డ్ పర్సన్‌గా సుమంత్ కనిపించబోతున్నట్లుగా మేకర్స్ రివీల్ చేశారు. అయితే సుమంత్‌కు ఒంటిరిగా ఉండడమంటే ఇష్టమట. పెళ్లంటే అలర్జీ అని.. వంట బాగా చేస్తాడని చెప్పుకొచ్చారు మేకర్స్. ఇందులో సుమంత్ సరసన నైనా గంగూలీ హీరోయిన్గా నటిస్తుండగా.. చరణ్ రాజ్ సమర్పణలో కె.రాజశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సుహాసిని, మంజుల ఘట్టమనేని, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలలో నటిస్తున్నారు. అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ట్వీట్..
Also Read: Evaru Meelo Koteeswarulu: తారక్ వచ్చేస్తున్నాడు.. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభం ఎప్పుడంటే.
Meera Mithun: పోలీసులకే సవాల్ విసిరింది.. అడ్డంగా బుక్కైంది.. ఎట్టకేలకు బిగ్‌బాస్ బ్యూటీ అరెస్ట్..
Independence Day 2021: దేశ భక్తిని నరనరాన నింపిన తెలుగు సినిమాలు ఇవే..
Nikhil Siddharth: యంగ్ హీరో నిఖిల్‌ను సన్మానించిన సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్జనార్.. ఎందుకంటే