Thank You Teaser: థ్యాంక్యూ టీజర్ వచ్చేసింది.. లైఫ్‏లో కంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న నాగచైతన్య..

నా సక్సెస్ కు కేవలం కారణం నేను.. లైఫ్ ఇంక కాంప్రమైజ్ అయ్యేదే లేదు.. నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే ఇది

Thank You Teaser: థ్యాంక్యూ టీజర్ వచ్చేసింది.. లైఫ్‏లో కంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న నాగచైతన్య..
Naga Chaitanya

Updated on: May 25, 2022 | 5:52 PM

డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు హీరో అక్కినేని నాగచైతన్య (Akkineni Nagachaitanya). ఇందులో చైతూ.. సాయి పల్లవి నటనతో సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ హీరో డైరెక్టర్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇందులో చైతూకు జోడిగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను జూలై 8న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలో థ్యాంక్యూ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు.

తాజాగా విడుదలైన థ్యాంక్యూ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నా సక్సెస్ కు కేవలం కారణం నేను.. లైఫ్ ఇంక కాంప్రమైజ్ అయ్యేదే లేదు.. నన్ను నేను సరిచేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే ఇది అంటూ నాగచైతన్య చెప్పే డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో మాళవికా నాయక్, అవికాగోర్ కీలకపాత్రలలో కనిపించగా.. చైతూ డిఫరెంట్ షెడ్స్ లో కనిపిస్తున్నాడు. మొత్తానికి తాజాగా విడుదలైన టీజర్ తో సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Loading...
Unable to load recommendations.
Follow Us