కల్యాణ్ దిలీప్ సుంకర.. ఒకప్పటి జనసేన నేత. ప్రజంట్ న్యాయవాది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. పలు అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు తన అభిప్రాయాలు చెబుతూ ఉంటారు. తెలుగు భాషపై మంచి పట్టు ఉంది. పలు అంశాలపై విసృతమైన పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. అప్పుడప్పుడు తన గోదావరి యాసలో కొందర్ని ఏకిపారేస్తుంటారు. స్వతహాగా ఈయన మెగా అభిమాని. ఆ కుటుంబంపై అమితమైన ప్రేమ ప్రదర్శిస్తూ ఉంటారు. మాములుగా అయితే తెలుగు రాష్ట్రాల్లో క్యాస్ట్, క్రీడ్, రిలీజన్ బట్టి ఎక్కువమంది హీరోలను, వారి సినిమాలను అభిమానిస్తూ ఉంటారు. కంటెంట్ బాగున్నా సరే.. బయట హీరోల సినిమాలను పొగడటం పక్కనబెడితే.. నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసేందుకు ఎక్కువ ప్రయత్నిస్తారు. తాజాగా వీరసింహారెడ్డి సినిమాను చూశారు కల్యాణ్. అయితే అనూహ్యంగా ఆయన సినిమాపై ప్రశంసలు వర్షం కురిపించారు.
సినిమా రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందంటూ తొలుత ఆయన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. అయితే ఆ పోస్ట్ కింద చాలామంది నెగటీవ్ కామెంట్స్ పెట్టారు. దీంతో.. మరో పోస్ట్ పెట్టారు కల్యాణ్ దిలీప్. మనస్ఫూర్తిగా చెప్తున్నా సినిమా నాకు చాలా నచ్చింది .. అని పేర్కొన్నారు. కానీ కొందరు నెగటివ్ పబ్లిసిటీ ఎందుకు చేస్తున్నారో అర్ధం కావట్లేదు అని పేర్కొన్నారు .. ఒకానొక సందర్భంలో తానే “జై బాలయ్య ” అని అరిచేసాను అని రాసుకొచ్చారు. ఇస్తాంబుల్‌లో బాలయ్య విలన్స్‌ను నరికే సీన్ కోసమైనా సినిమా చూడాల్సిందే .. ఎవరి మాటలు నమ్మకండి .. బొమ్మ అదుర్స్ అంతే .. అంటూ పేర్కొన్నారు కల్యాణ్.
అయితే కల్యాణ్ దిలీప్ వెటకారంగానే ఆ కామెంట్స్ పెట్టారని కొందరు అంటున్నారు. వాస్తవంగా అయితే ఆయన వీరసింహారెడ్డి సినిమాలోని కొన్ని సీన్స్ రికార్డ్ చేసి మరీ ఈ కామెంట్స్ చేశారు. గోదావరి జిల్లాల వాళ్లకు నిజంగానే వెటకారం ఎక్కువ అని బయట అంటుంటారు. మరి దిలీప్ చేసిన వ్యాఖ్యలు నిజమేనా..? సినిమా నచ్చి చేసినవేనా..? లేదా వెటకారంగా చేసినవా అనేది ఆయనే క్లారిటీ ఇస్తే బాగుంటుంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.