
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ఆదిపురుష్ రిలీజ్ కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామాయణం మహా కావ్యం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ మైథలాజికల్ మూవీని తెరకెక్కించారు. కృతిసనన్ సీతమ్మ పాత్రలో నటించగా, బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపించనున్నారు. భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ సుమారు రూ.500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఆదిపురుష్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే అన్నిహంగులు పూర్తి చేసుకున్న ఈ పౌరాణికం సినిమా జూన్ 16న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీ ఎత్తున ప్రభాస్ రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే పలు నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్‌లు కూడా ప్రారంభమయ్యాయి. ఇదిలా ఉంటే ప్రభాస్ ఆదిపురుష్ సినిమాపై రోజుకో రూమర్ క్రియేట్ అవుతోంది. వీటిపై స్పందించిన మూవీ యూనిట్ ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తోంది. తాజాగా ప్రభాస్ సినిమాకు సంబంధించి మరొక న్యూస్ నెట్టింట వైరలవుతోంది. కాగా ఆది పురుష్ ప్రదర్శిచే థియేటర్లలో హనుమంతుడి కోసం ఒక సీటును ఖాళీగా ఉంచనున్న సంగతి తెలిసిందే.
అయితే దీనిపై కూడా కొందరు నెగెటివ్ రూమర్స్ క్రియేట్ చేశారు. ఆదిపురుష్ మూవీ యూనిట్ హనుమంతుడి ప్రత్యేకంగా సీట్ కేటాయిస్తోంది భక్తితో కాదని.. దానిని కూడా క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఈక్రమంలో ఖాళీగా ఉన్న ఈ సీటు పక్కనున్న సీటు కోసం థియేటర్లు భారీ మొత్తంలో వసూలు చేస్తున్నాయని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరికొందరు ఖాళీ సీట్ల పక్కనే ఉన్న సీట్లకు టిక్కెట్లు కొని బ్లాక్‌లలో పెట్టి భారీ మొత్తానికి విక్రయిస్తున్నారనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై ఆదిపురుష్ టీమ్ స్పందించింది. ‘ఆదిపురుష్ టిక్కెట్ ధరలపై మీడియాలో, సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే కథనాలు వస్తున్నాయి. హనుమంతుడికి రిజర్వు చేసిన పక్కనే ఉన్న సీట్ల ధరల్లో ఎలాంటి తేడా లేదని, మిగతా సీట్ల మాదిరిగానే వాటి ధర ఉంటుందని స్పష్టం చేస్తున్నాం. దయచేసి తప్పుడు వార్తలను నమ్మవద్దు.’ అని ఆదిపురుష్ నిర్మాణ సంస్థ టీ- సిరీస్ ట్వీట్ చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..