Sushmita Sen: మూడేళ్లుగా సింగిల్‏గా ఉంటున్నా.. పెళ్లి చేసుకోవాలనుకున్నా పిల్లలు ఒప్పుకోవడం లేదు.. సుష్మితా సేన్..

ఇక తన మాజీ బాయ్ ఫ్రెండ్, మోడల్ రోహ్మన్ షాతో ఎప్పుడూ బాలీవుడ్ ఈవెంట్స్, పార్టీలలో కనిపిస్తుంది. సుష్మితా జీవితంలో స్పెషల్ ఈవెంట్స్, పార్టీస్ అయితే రోహ్మాన్ కచ్చితంగా ఉండాల్సిందే. కానీ వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు చేరలేదు. తాజాగా తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది సుష్మితా..తాను ఇప్పటికీ సింగిల్ అంటూ అసలు విషయం చెప్పేసింది.

Sushmita Sen: మూడేళ్లుగా సింగిల్‏గా ఉంటున్నా.. పెళ్లి చేసుకోవాలనుకున్నా పిల్లలు ఒప్పుకోవడం లేదు.. సుష్మితా సేన్..
Sushmita Sen
Follow us

|

Updated on: Jul 21, 2024 | 6:51 PM

బాలీవుడ్ బ్యూటీ సుష్మితా సేన్ ఎప్పుడూ పర్సనల్ విషయాలతోనే వార్తలలో నిలుస్తుంటుంది. హిందీలో అనేక సినిమాల్లో నటించి స్టార్ డమ్ అందుకున్న ఈ బ్యూటీ.. రియల్ లైఫ్ లో మాత్రం చాలామందితో బ్రేకప్ చేసిందని అంటుంటారు. కానీ సుష్మితా జీవితంలో ఏ ప్రేమ కూడా పెళ్లి వరకు చేరుకోలేదు. ప్రస్తుం ఈ హీరోయిన్ వయసు 48 సంవత్సరాలు. కానీ ఇప్పటికీ లవ్, బ్రేకప్ అంటూ నిత్యం ఏదోక వార్త హల్చల్ చేస్తుంటుంది. ఈ బ్యూటీ ఇప్పటివరకూ ఎవరినీ కూడా తన జీవిత భాగస్వామిగా అంగీకరించలేకపోయింది. కొన్నాళ్ల క్రితం ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో ప్రేమలో ఉన్నప్పటికీ కొద్దిరోజులకే విడిపోయారు. ఇక తన మాజీ బాయ్ ఫ్రెండ్, మోడల్ రోహ్మన్ షాతో ఎప్పుడూ బాలీవుడ్ ఈవెంట్స్, పార్టీలలో కనిపిస్తుంది. సుష్మితా జీవితంలో స్పెషల్ ఈవెంట్స్, పార్టీస్ అయితే రోహ్మాన్ కచ్చితంగా ఉండాల్సిందే. కానీ వీరిద్దరి ప్రేమ పెళ్లి వరకు చేరలేదు. తాజాగా తన లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టింది సుష్మితా..తాను ఇప్పటికీ సింగిల్ అంటూ అసలు విషయం చెప్పేసింది.

“నా జీవితంలో ప్రస్తుతం ఏ పురుషుడు లేడు. మూడేళ్లుగా ఒంటరిగానే ఉంటున్నాను. ప్రేమ వెంట పరుగెత్తాలనే ఆలోచన.. ఆసక్తి రెండూ లేవు.. అంతకు ముందు ఐదేళ్లపాటు ఒకరితో రిలేషన్ లో ఉన్నాను. కానీ ఆ ప్రేమకు బ్రేకప్ చెప్పి లవ్ లైఫ్ లో బ్రేక్ తీసుకోవడం బాగుంది. ఇప్పుడు ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెబితే నా పిల్లలు అస్సలు ఒప్పుకోరు. ఫలానా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది ? అని అడిగితే నా పెద్ద కూతురు వద్దు అంటుంది. ఎవరినీ పెళ్లి చేసుకోవద్దు.. ఇప్పుడు ఆ అవసరం లేదు. నీకు నచ్చినట్లుగా లైఫ్ ఉంటుంది కదా.. ఇంకా పెళ్లి ఎందుకు.. ? అని ప్రశ్నిస్తోంది” అంటూ చెప్పుకొచ్చింది.

సుష్మితా సేన్ చాలా కాలంగా మోడల్ రోహ్మాన్ తో డేటింగ్ లో ఉంది. కానీ వీరిద్దరు 2021 విడిపోయారు. అయినా చాలాసార్లు పార్టీస్, ఈవెంట్లలో వీరిద్దరూ కలిసి కనిపిస్తుంటారు. సుష్మితా ఇప్పటివరకు ఎవరినీ పెళ్లి చేసుకోలేదు. కానీ 2000లో రెనీని దత్తత తీసుకుంది. ఆ తర్వాత 2010లో అలీసాను దత్తత తీసుకుంది. సుష్మితా చివరగా ఆర్య: అంతిమ్ వార్ వెబ్ సిరీస్ లో కనిపించింది. ప్రస్తుతం ఈ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మూడేళ్లుగా సింగిల్‏గా ఉంటున్నా.. సుష్మితా సేన్..
మూడేళ్లుగా సింగిల్‏గా ఉంటున్నా.. సుష్మితా సేన్..
కావ్య మారన్‌ని ఛాంపియన్‌గా నిలబెట్టాడు.. కట్‌చేస్తే..
కావ్య మారన్‌ని ఛాంపియన్‌గా నిలబెట్టాడు.. కట్‌చేస్తే..
బంగారం అమ్మాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌.. మీ వద్దకే ఆఫీస్
బంగారం అమ్మాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌.. మీ వద్దకే ఆఫీస్
పెళ్లైన పది నెలలకే ఇంటి నుంచి గెంటేసిన రెండో భర్త..
పెళ్లైన పది నెలలకే ఇంటి నుంచి గెంటేసిన రెండో భర్త..
శృంగారం సమయంలో అందరూ తెలీక చేసే తప్పు ఇదే
శృంగారం సమయంలో అందరూ తెలీక చేసే తప్పు ఇదే
పాత ఈ-స్కూటర్ కొంటున్నారా.. ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి..
పాత ఈ-స్కూటర్ కొంటున్నారా.. ఈ అంశాలను జాగ్రత్తగా పరిశీలించండి..
INDW vs UAEW: టీ20ల్లో తొలిసారి చరిత్ర సృష్టించిన భారత్..
INDW vs UAEW: టీ20ల్లో తొలిసారి చరిత్ర సృష్టించిన భారత్..
హడలెత్తిస్తున్న నిపా వైరస్, కేంద్రం అప్రమత్తం, కేరళకు వైద్య బృందం
హడలెత్తిస్తున్న నిపా వైరస్, కేంద్రం అప్రమత్తం, కేరళకు వైద్య బృందం
ఆ వస్తువులపై రూపాయి డిస్కౌంట్‌! ఫుట్‌బాల్ ఆడుకుంటున్న నెటిజన్లు..
ఆ వస్తువులపై రూపాయి డిస్కౌంట్‌! ఫుట్‌బాల్ ఆడుకుంటున్న నెటిజన్లు..
కుక్కర్‌లో సింపుల్‌గా మటన్ బిర్యానీ ఇలా చేశారంటే.. ఆహా అనాల్సిందే
కుక్కర్‌లో సింపుల్‌గా మటన్ బిర్యానీ ఇలా చేశారంటే.. ఆహా అనాల్సిందే