Nithya Menen: పెళ్లి వార్తల పై స్పందించిన నిత్యామీనన్.. అమ్మడు ఏమన్నాదంటే..

|

Jul 20, 2022 | 5:55 PM

బాబ్లీ బ్యూటీ నిత్యామీనన్ (Nithya Menen)ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ రాణిస్తుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లిపీటలెక్కనుందని ఓ వార్త ఇటీవల ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొట్టింది.

Nithya Menen: పెళ్లి వార్తల పై స్పందించిన నిత్యామీనన్.. అమ్మడు ఏమన్నాదంటే..
Nithya Menon
Follow us on

బాబ్లీ బ్యూటీ నిత్యామీనన్ (Nithya Menen)ఆచి తూచి సినిమాలు ఎంచుకుంటూ రాణిస్తుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ త్వరలో పెళ్లిపీటలెక్కనుందని ఓ వార్త ఇటీవల ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొట్టింది. మలయాళీ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరోతో ఆమె వివాహం జరగనుందని.. స్నేహితుల ద్వారా పరిచయమైన వీళ్లిద్దరూ చాలా సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నారని.. ఇటీవలే తమ ప్రేమ విషయాన్ని కుటుంబసభ్యులకు తెలపగా.. ఇరు కుటుంబాలు అంగీకరించాయని..త్వరలోనే వీరు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ వార్తల పై స్పందించింది నిత్యామీనన్. తన పెళ్లి పై వస్తోన్న రూమర్స్ ను ఆమె ఖండించారు. వాటిలో ఎలాంటి వాస్తవం లేదని నిత్యా తేల్చి చెప్పారు.

తాజాగా ఓ ఇంగ్లిష్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ మాట్లాడుతూ.. పెళ్లి వార్తల్లో వాస్తవం లేదని.. ఓ వార్త రాసేటప్పుడు నిజానిజాలు తెలుసుకొని రాయాలని ఆమె మీడియాను కోరారు. ఇక నిత్యామీనన్ సినీ కెరీర్ విషయానికొస్తే.. అలా మొదలైంది సినిమాతో హీరోయిన్ గా తెలుగులో పరిచయం అయిన ఈ చిన్నది. ఆ తర్వాత ఇక్కడ వరుస సినిమాల్లో నటించింది. తెలుగుతో పాటు తమిళ్ నూ ఈ అమ్మడు తన సినిమాలతో ఆకట్టుకుంది. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాలో పవన్ కు జోడీగా నటించి మెప్పించింది నిత్యామీనన్. అదేవిధంగా నిత్యా నటించిన 19 అనే వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. అలాగే తమిళ్ లో ఓ సినిమా, మలయాళం లో ఓ మూవీ చేస్తోంది నిత్య.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి