ఇటీవల మలయాళంలో విడుదలైన ప్రేమలు మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తీకేయ ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు. ఇందులో కథానాయికగా నటించిన మమితా బైజు పేరు గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో మారుమోగుతుంది. ఓవైపు ఈ బ్యూటీ నటించిన ప్రేమలు సినిమా భారీ విజయాన్ని అందుకుని దూసుకుపోతుండగా.. మమిత బైజు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలలో నిలిచింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ భామ చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాయి. తమిళంలో డైరెక్టర్ బాలా సినిమాను నుంచి తప్పుకోవడం.. సెట్ లో అతడు తనతో ప్రవర్తించిన తీరుపై ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ బాలా చిన్నపాటి గొడవలు చేసేవారని.. తనను దూషించేవారని.. ఒక సీన్ సమయంలో తనపై చేయి చేసుకున్నారని చెప్పుకొచ్చింది. అయితే ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళ్ ఫిల్మ్ సర్కిల్లో చర్చనీయాంశమయ్యాయి.
తన గురించి నెట్టింట ప్రచారమవుతున్న వార్తలపై తాజాగా మమితా రియాక్ట్ అయ్యింది. ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ తన ఇన్ స్టా స్టోరీలో సుధీర్ఘ నోట్ రాసుకొచ్చింది. “నా గురించి తమళం సినిమా వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవి. డైరెక్టర్ బాలా విల్లాడిచం పాట చేయాలని కోరారు. ఆ సమయంలో నేను సరిగ్గా నటించేందుకు నన్ను కోప్పడంతో నేను మూడు షాట్స్ తీసుకుని అద్భుతంగా నటించాను. ఇదే విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పాను. కానీ నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను సెట్ లో డైరెక్టర్ బాలా నుంచి ఎలాంటి బెదిరింపులు చూడలేదు. ఎలాంటి మానసిక లేదా శారీరక వేధింపులను ఎదుర్కొలేదు.. సూర్య సర్, బాలా సర్ సినిమా నుంచి నేను తప్పుకోవడానికి కారణం కేవలం అంతకు ముందు నేను ఒప్పుకున్న సినిమాలే కారణం ” అంటూ రాసుకొచ్చింది మమితా.. ప్రస్తుతం మమితా చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
#Premalu fame #MamithaBaiju talks about director Bala hitting her on the sets of #Vanangaan. Thankfully, #Suriya and left the project. We’ve known this about #Bala for years, and yet he continues to abuse artists on sets. pic.twitter.com/NSRRRc730u
— George 🍿🎥 (@georgeviews) February 28, 2024
కోలీవుడ్ స్టార్ సూర్య ప్రధాన పాత్రలో డైరెక్టర్ బాలా వనంకన్ సినిమా తెరకెక్కించాల్సి ఉంది. ఈ మూవీ గురించి అధికారికంగా ప్రకటించడమే కాకుండా కొన్ని రోజులపాటు రెగ్యులర్ షూటింగ్ జరిగింది. కానీ అనుహ్యంగా ఈ మూవీ నుంచి తప్పుకున్నట్లు సూర్య వెల్లడించారు. అలాగే ఈ మూవీ కథలో కొన్ని మార్పులు చేస్తున్నానని.. తాను అనుకున్న పాత్రకు సూర్యకు సెట్ కాదంటూ డైరెక్టర్ బాలా కూడా క్లారిటీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో మమితా బైజు కీలకపాత్రలో కనిపించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో మమితా తప్పుకుంది. ఇదే విషయంపై ఇటీవల ప్రేమలు మూవీ ప్రమోషన్లలో ప్రస్తావించింది. అయితే ఆమె చేసిన కామెంట్స్ పూర్తిగా వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారమయ్యాయని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.