AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR : ఎన్టీఆర్ అంటే నాకు పిచ్చి ఇష్టం.. ఆటోగ్రాఫ్ కోసం కావాలని అడిగిన హీరోయిన్

పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది.

NTR : ఎన్టీఆర్ అంటే నాకు పిచ్చి ఇష్టం.. ఆటోగ్రాఫ్ కోసం కావాలని అడిగిన హీరోయిన్
Ntr
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2026 | 8:12 AM

Share

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తారక్.. ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇదిలా ఉంటే, ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ నటి ఖుష్బూ తనకు తారక్ అంటే ఎంత ఇష్టమో చెబుతూ, ఆయన ఆటోగ్రాఫ్ కావాలని కోరుకున్న విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

తారక్ అంటే పిచ్చి.. ఆటోగ్రాఫ్ కావాలంటున్న ఖుష్బూ

గతంలో ఓ ఇంటర్వ్యూలో ఖుష్బూ తన సినీ ప్రయాణం, అభిమాన నటుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకు అత్యంత ఇష్టమైన హీరో ఎవరు అని ప్రశ్నించగా.. ఆమె ఏమాత్రం ఆలోచించకుండా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పారు. తారక్ తనకు ఎంతో ఇష్టమైన హీరో అని, ఈ విషయం చాలామందికి ఇప్పటికే తెలుసని ఖుష్బూ తెలిపారు. అదే ఇంటర్వ్యూలో తనకు ఉన్న ఒక కోరిక ఏంటి అని అడగ్గా.. ఎలాగైనా ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ పొందాలని ఉందని ఆమె వెల్లడించారు.

“తారక్.. నా పేరు రాసి ఆటోగ్రాఫ్ పంపించండి”

తన మనసులోని కోరికను ఖుష్బూ సరదాగా ఇలా వ్యక్తం చేశారు. “తారక్.. మీరు ఈ ఇంటర్వ్యూ చూస్తున్నట్లయితే, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్‌ని. నాకు ఒక ఆటోగ్రాఫ్, నా పేరు రాసి పంపించండి. అది చాలు నాకు” అని ఆమె కోరారు. అంతేకాదు, తన మాటలు విని తారక్ ఇబ్బంది పడతారేమోనని ఖుష్బూ సరదాగా వ్యాఖ్యానించారు. ఓ సీనియర్ నటి, స్టార్ హీరోను అభిమానిస్తూ ఆయన ఆటోగ్రాఫ్ కోరుకోవడం అప్పట్లో ఆసక్తికరంగా మారింది.

ఖుష్బూ అభిమానంపై ఎన్టీఆర్ స్పందన

ఖుష్బూ తనపై వ్యక్తం చేసిన అభిమానాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ కూడా ఓ సందర్భంలో స్పందించారు. బృందా గారి దర్శకత్వంలో ఓ సినిమా పాట షూటింగ్ సమయంలో తొలిసారి ఖుష్బూతో కలిసి మాట్లాడిన విషయాన్ని తారక్ గుర్తుచేసుకున్నారు. తమిళం, తెలుగు భాషల్లో గొప్ప నటిగా పేరు తెచ్చుకున్న ఖుష్బూ.. తనను ఇంతగా ప్రశంసించడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతి అని ఎన్టీఆర్ తెలిపారు. సీనియర్ నటి తనను అభిమానించడం, తనపై ఇలాంటి ప్రశంసలు కురిపించడం తనకు గర్వంగా అనిపించిందని చెప్పారు.

“ఖుష్బూ మంచి నటి మాత్రమే కాదు.. మంచి వ్యక్తి కూడా”

ఖుష్బూ గురించి ఎన్టీఆర్ మరిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె కేవలం గొప్ప నటి మాత్రమే కాదని, మంచి వ్యక్తి కూడా అని ప్రశంసించారు. తన ఆటోగ్రాఫ్ కావాలని ఖుష్బూ కోరుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తారక్ పేర్కొన్నారు. అలాగే, తాను నటించిన యమదొంగ సినిమాలో ఖుష్బూతో కలిసి నటించిన విషయాన్ని ఎన్టీఆర్ గుర్తుచేసుకున్నారు. అయితే, ఆ సినిమాలో తమ ఇద్దరికీ కాంబినేషన్ సన్నివేశాలు లేవని చెప్పారు. ఖుష్బూ.. మోహన్ బాబు భార్య పాత్రలో నటించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. భవిష్యత్తులో ఖుష్బూతో కలిసి నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని ఎన్టీఆర్ తెలిపారు. ప్రస్తుతం ఖుష్బూ చేసిన వ్యాఖ్యలు, వాటిపై తారక్ స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తమ అభిమాన హీరోను ఓ సీనియర్ నటి ఇంతగా అభిమానించడం నందమూరి అభిమానులను సైతం ఆకట్టుకుంటోంది.

View this post on Instagram

A post shared by Ravi Varma V (@stills.ravi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us