Keerthy Suresh: ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కిన కీర్తి సురేశ్.. గోవాలో గ్రాండ్ వెడ్డింగ్.. ఫొటోస్ చూశారా?

|

Dec 12, 2024 | 2:54 PM

మహానటి కీర్తి సురేశ్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని తట్టిల్ తో కలిసి గురువారం (డిసెంబర్ 12) వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

Keerthy Suresh: ప్రియుడితో కలిసి పెళ్లిపీటలెక్కిన కీర్తి సురేశ్.. గోవాలో గ్రాండ్ వెడ్డింగ్.. ఫొటోస్ చూశారా?
Keerthy Suresh
Follow us on

సౌత్ స్టార్ హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి డేట్‌ను ముందు నుంచి సీక్రెట్‌గా ఉంచుతూ వచ్చిన కీర్తి,
తాజాగా తన సోషల్ మీడియా పేజ్‌లో పెళ్లి ఫోటోలు షేర్ చేసింది. తన లాంగ్ టైమ్ బాయ్‌ఫ్రెండ్‌ ఆంటోని తట్టిల్‌ను పెళ్లి చేసుకుంది కీర్తి. గోవా వేదికగా గురువారం (డిసెంబర్ 12) జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. హిందూ సాంప్రదాయ పద్దతిలో కీర్తి సురేశ్ వివాహ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే క్రిస్టియన్‌ పద్దతిలోనూ పెళ్లి జరుగనుందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ ఏడాది దీపావళి రోజున ఆంటోనీ తట్టిల్ తో తన ప్రేమ విషయాన్ని  బయటపెట్టింది కీర్తి సురేశ్. ’15 ఏళ్ల తమ స్నేహ బంధం ఇకపై జీవితాంతం కొనసాగుతుంది’ అని ఇద్దరూ కలిసున్న ఫొటోను షేర్ చేసింది. ఆ తర్వాత పెళ్లి పనుల్లో భాగంగా తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకుంది. ఇప్పుడు పెళ్లి చేసుకుని తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

 

ఇవి కూడా చదవండి

కాగా మలయాళ ప్రముఖ నిర్మాత సురేశ్, నటి మేనకల కూతురైన కీర్తి సురేశ్.. ఛైల్డ్ ఆర్టిస్టుగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. .తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సొంతం చేసుకుంది. ఇక మహానటి సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నటి పురస్కారం కూడా అందుకుందీ అందాల తార. ఇప్పుడు బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో కూడా అదృష్టం పరీక్షించుకోనుంది కీర్తి. త్వరలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇంతలోనే  ప్రియునితో పెళ్లిపీటలెక్కిందీ ముద్దుగుమ్మ.

 

కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోస్ ఇదిగో..

కాగా కీర్తి, ఆంటోని లకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. ఆ తర్వాత అతి ప్రేమగా చిగురించింది.  ఖతార్‌ లో పలు వ్యాపారాలను నిర్వహిస్తోన్న ఆంటోని  కొచ్చిలో విండో సొల్యూషన్స్ కోసం యాస్పెరాస్ కంపెనీ పెట్టాడు. ఆ తర్వాత హోటల్స్ వ్యాపారంలోనూ అడుగుపెట్టాడు.

బేబీజాన్ సినిమాలో కీర్తి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.