తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఓ ఇంటివారయ్యారు. పూజా అనే అమ్మాయితో కలిసి ఆయన ఏడడగులు వేశారు. వీరి వివాహానికి టాలీవుడ్ హీరో నితిన్.. హీరోయిన్ కీర్తి సురేష్… డైరెక్టర్ వెంకీ కుడుముల .. ప్రొడ్యూసర్ స్వప్న దత్.. ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జంటతో తీసుకున్న ఫోటోలను అటు నితిన్, ఇటు కీర్తి సురేష్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అయితే ఆ ఫోటోలలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం కీర్తి సురేష్. ముఖ్యంగా డ్రెస్సింగ్. వెంకీ అట్లూరి పెళ్లికి కీర్తి రంగు రంగుల లెహంగాను ధరించింది. దీంతో ఇప్పుడు ఆమె ఫ్యాషన్ సెన్స్ ను ట్రోల్ చేస్తున్నారు నెటినజ్స్. ఆమె తన దుస్తులను షామియానా.. కర్టెన్ క్లాత్‌తో రెడీ చేయించుకుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కీర్తి పిక్ షేర్ చేసి.. మీ దుస్తువులను షామియానాతో కుట్టిస్తే ఇలాగే ఉంటుంది. అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. కీర్తి సురేష్ చివరిసారిగా మలయాళ చిత్రం వాషిలో కనిపించింది. ఇక తెలుగులో ఆమె సర్కారు వారి పాట చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె న్యాచురల్ స్టార్ నాని సరసన దసరా చిత్రంలో నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది. ఇందులో చిరు చెల్లిగా కనిపించనుంది.
ఇదిలా ఉంటే.. ఇటీవల కొద్ది రోజులుగా కీర్తి సురేష్ సినిమా అప్డేట్స్ కంటే ఆమె వ్యక్తిగత జీవితం గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. తన స్నేహితుడితో కీర్తి సురేష్ ప్రేమలో ఉందని.. నాలుగేళ్ల తర్వాత వీరు పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడిచింది. తాజాగా వీటిపై స్పందించిన కీర్తి సురేష్ తల్లి మేనక.. తన కూతురి గురించి వస్తున్న వార్తలు అవాస్తమని కొట్టిపారేసారు.
Congratulations Venkyyyy Swamy and Pooja! May god shower all the love on you both for this new beginning! ?♥️♥️ pic.twitter.com/wp82WEXRjb
— Keerthy Suresh (@KeerthyOfficial) February 1, 2023
Dress marchipoiii tent cloth chutesukunaatu undi..
— Rowdy DHFM ? (@JyothsnaSri7) February 1, 2023
Shamiyana lehanga
— True Indian (@Muralik74294478) February 1, 2023
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.