Kangana Ranaut: కంగనా రనౌత్‌కు షాక్.. 40 కోట్ల పరువు నష్టం దావా.. అసలు ఏం జరిగిందంటే?

| Edited By: Basha Shek

Aug 08, 2024 | 10:16 PM

బాలీవుడ్ ప్రముఖ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ పరిశ్రమలో ఉన్నప్పుడే తన దూకుడుతో లెక్కలేనన్ని వివాదాలను ఎదుర్కొంది. ఇప్పుడామె రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా తన ఘాటు విమర్శలు, ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది

Kangana Ranaut: కంగనా రనౌత్‌కు షాక్.. 40 కోట్ల పరువు నష్టం దావా.. అసలు ఏం జరిగిందంటే?
Kangana Ranaut
Follow us on

బాలీవుడ్ ప్రముఖ నటి, ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినీ పరిశ్రమలో ఉన్నప్పుడే తన దూకుడుతో లెక్కలేనన్ని వివాదాలను ఎదుర్కొంది. ఇప్పుడామె రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. అక్కడ కూడా తన ఘాటు విమర్శలు, ప్రకటనలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. బీజేపీ నుంచి ఎంపీగా ఎన్నికైన కంగనా రనౌత్ ఇటీవల ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని విమర్శిస్తూ వక్రీకరించిన ఒక ఫొటోను షేర్ చేసింది. ఈ నేపథ్యంలో కంగనాపై ఏకంగా రూ.40 కోట్ల పరువునష్టం దావా వేశారు. ఇటీవల రాహుల్ గాంధీ పార్లమెంటులో కుల గణనపై ఉపన్యసించారు. దీనికి కౌంటర్ గా కంగనా ఎడిట్ చేసిన ఫోటోను షేర్ చేసింది. ముస్లిం క్యాప్, క్రిస్టియన్ శిలువ, హిందూ తిలకం ఇలా మూడు మతాలు కలిపినట్లుగా ఆ ఫొటోను ఎడిట్ చేశారు. కంగనా రనౌత్ షేర్ చేసిన క్షణాల్లోనే ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. తాజాగా ఈ విషయమై కంగనా రనౌత్‌పై సుప్రీంకోర్టు న్యాయవాది నరేంద్ర మిశ్రా పరువు నష్టం దావా వేశారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం ఏదైనా వ్యక్తి ఫోటోను ట్యాంపర్ చేసి ఆన్‌లైన్‌లో షేర్ చేయడం నేరం. ఇది రాహుల్ గాంధీని బహిరంగంగా అవమానించినట్లేనని నరేంద్ర మిశ్రా తెలిపారు.

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కంగనా రనౌత్ ఎంపీగా ఎన్నికయ్యారు. సినిమా పనులతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా ఉన్నారు. ఆయన దర్శకత్వం వహించి, నిర్మించి, నటించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రం సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ సినిమా ఇప్పటికే విడుదలై ఉండాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల విడుదల వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి

రాహుల్ గాంధీ మార్ఫింగ్ ఫొటోను..

హిమాచల్ ప్రదేశ్ లో కంగనా పర్యటన..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.