స్టార్ హీరో సూర్య నటించిన కంగువ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదలకు ముందు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా విభిన్న కథతో తెరకెక్కింది. ఈ సినిమాలో సూర్య రెండు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. కాగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. కంగువ సినిమాకు మొదటి రోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. సూర్య అభిమానులు చాలా మంది కంగువ సినిమా నిరాశపరిచింది అని ఫీల్ అయ్యారు. కానీ యాక్షన్స్ ఎపిసోడ్ మాత్రం ఆకట్టుకున్నాయని చెప్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సూర్య సతీమణి జ్యోతిక కూడా కంగువ సినిమా పై రివ్యూ ఇచ్చారు. సినిమాలో ఆ పార్ట్ బాలేదు అని ఆమె అన్నారు. ఇంతకూ జ్యోతికాకు సినిమా ఎలా అనిపించిందంటే..
నేను సూర్య భార్యగా కంటే .. ఓ మూవీ లవర్ గా నేను కంగువ సినిమా రివ్యూ చెప్తున్నా.. ఈ సినిమా నిజంగా ఓ అద్భుతమైన చిత్రం. సూర్య మరోసారి తన నటనతో ఆకట్టుకున్నాడు. ఆ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నాను. అందరూ అంటున్నట్టు నిజంగానే మొదటి అరగంట సినిమా అనుకున్న స్థాయిలో లేదు. అదే విధంగా సౌండ్ చాలా ఎక్కువగా ఉంది. అవి మాత్రమే మైనస్.. చాలా సినిమాల్లో ఎన్నో లోపాలు ఉంటాయి. అలాంటిది ఇలాంటి ప్రయోగత్మక చిత్రాల్లో చిన్న చిన్న లోపాలు ఉండటంలో తప్పే లేదు. మూడు గంటలు ఉన్న కంగువలో బాలేనిది కేవలం అరగంట మాత్రమే.. నిజం చెబుతున్నా.. ఇదొక అద్భుత సినిమాటిక్ అనుభూతిని అందించింది.
సూర్య సినిమాల్లో ఇలాంటి కెమెరా వర్క్‌ను ఎప్పుడూ చూడలేదు. కంగువ సినిమాకు వస్తున్న నెగిటివ్ రివ్యూలు చూసి షాక్ అయ్యా .. అంతకు ముందు వచ్చిన భారీ బడ్జెట్ సినిమాల్లో చాలా లోపాలు ఉన్నాయి. సీన్స్ బాలేకున్నా, మహిళలను కించపరిచేలా డైలాగ్స్ ఉన్న ఇలాంటి రివ్యూలు చూడలేదు. కానీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్, మహిళల పై వచ్చే ఫైట్ సీన్స్, సన్నివేశాలు చిన్నారి పై కంగువ చూపించే ప్రేమ ఇలా చాలా ఉన్నాయి .. వాటి గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు.. నాకు తెలిసి రివ్యూ చేసే సమయంలో పాజిటివ్స్ మరిచిపోయినట్లు ఉన్నారు. విడుదలైన తొలి రోజు నుంచే ఇంత నెగెటివిటీని చూడటం బాధగా ఉంది. అద్భుతమైన సినిమాను తెరకెక్కించడానికి మూవీ టీమ్ చేసిన కృషిని మెచ్చుకోవలసిందే” అని జ్యోతికా అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.