Secret Soldier : సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే స్పై డ్రామాగా రానున్న సీక్రెట్ సోల్జర్..
సీక్రెట్ సోల్జర్ ఆడియన్స్‌కు కొత్త ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే స్పై డ్రామా. యాక్షన్ చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. స్నేహం-దేశభక్తి అందరికీ కనెక్ట్ అవుతుంది. చాలా కాలం గుర్తుండిపోతుందని హీరోలు నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ అన్నారు. ఈ సినిమాకు అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘సీక్రెట్ సోల్జర్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘుబాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు.ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యూమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన టీజర్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
B Gopal: తండ్రి కొడుకులను పెట్టి సినిమా చేశా.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది : బి. గోపాల్
‘చైనా పీస్’గా మొదలైన ప్రయాణం ‘సీక్రెట్ సోల్జర్’గా ఎలా మారింది అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘చైనా పీస్’ పేరుతోనే టీజర్ రిలీజ్ చేశాను. అలాగే రెండు పాటలు కూడా విడుదల చేశాను. అదే పేరుతో చాలా మార్కెటింగ్ చేశాం. మార్చిలో సినిమా రిలీజ్ చేద్దామని సెన్సార్‌కు పంపించాను. సెన్సార్ నుంచి అభ్యంతరాలు వచ్చాయి. రివ్యూ కమిటీలు, ఈబీసీ చైర్మన్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టర్నల్ అఫైర్స్.. ఇలా అన్ని స్థాయిలు దాటుకుని లిస్టు పంపించారు. అందులో మొదటి పాయింట్.. టైటిల్ ‘చైనా పీస్’ ఉండకూడదు. ఈ కథ ఆలోచన, ఉద్దేశంతో ఆలోచించుకుని ‘సీక్రెట్ సోల్జర్’ అయితే బాగుంటుందని ఆ టైటిల్ పెట్టాం.
అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.?
సెన్సార్‌లో దాదాపు 8 నెలలు ఈ సినిమా ఉన్నప్పటికీ, మేం ఏ ఆలోచనతో సినిమా తీశామో.. ఆ ఆలోచన విషయంలో ఎలాంటి ఇబ్బంది రాలేదు. మా డైరెక్టర్ విశ్వనాథ్ గారు చాలా కష్టపడ్డారు. కంటెంట్ విషయంలో తగ్గించడానికి ఎక్కడా కూడా రాజీ పడలేదు. విజువల్స్ పరంగా చాలా చిన్న కట్స్ మాత్రమే వచ్చాయి. ఇది స్పై డ్రామా. ఇందులో స్పై యాక్షన్ కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. ఇండియా కి సంబధించిన ఓ కీలక ఇన్ఫర్మేషన్ లీక్ అయింది. ఆ సంఘటనకి నెల్లూరులో చాలా సాదాసీదాగా బతికే ఇద్దరు కుర్రాళ్లకి లింక్ ఏమిటి? ఆ సమస్యను పరిష్కరించగలిగారా లేదా? అనేది ఒక లైన్. ఫస్ట్ హాఫ్ లో ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్ చాలా బాగుంటాయి. మా ఇద్దరి క్యారెక్టర్స్ ఈ వరల్డ్‌లోకి ఎలా వచ్చాయి అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మంచి హ్యూమర్, ట్విస్టులు ఉంటాయి. ఫైనల్‌గా సినిమా ఒక మంచి ఫ్రెండ్‌షిప్ కథగా కూడా ఉంటుంది. స్నేహం, దేశభక్తి.. ఈ రెండు ఎమోషన్స్‌తో ఇప్పటివరకు చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. ఇందులో అలాంటి ఒక కొత్త ఎమోషన్‌ను ఆడియన్స్ చూడబోతున్నారు. కచ్చితంగా ఈ సినిమాతో మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు అని చెప్పుకొచ్చారు.
నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




