Vijay Sethupathi: ఫ్యాన్స్ అలా పిలవడంపై విజయ్ సేతుపతి అసహనం.. అది అవసరం లేదంటూ స్వీట్ వార్నింగ్..

ఇందులో షాహిద్ కపూర్, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సిరీస్ ప్రమోషనల్లో పాల్గోన్న సేతుపతికి కొందరు అభిమానుల పిలుపు అసహనం తెప్పించింది. దీంతో ఆయన మాట్లాడుతూ ఫ్యాన్స్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

Vijay Sethupathi: ఫ్యాన్స్ అలా పిలవడంపై విజయ్ సేతుపతి అసహనం.. అది అవసరం లేదంటూ స్వీట్ వార్నింగ్..
Vijay Sethupathi

Updated on: Feb 08, 2023 | 3:27 PM

ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో విలక్షణ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. తెలుగులో బుచ్చిబాబు సన తెరకెక్కించిన ఉప్పెన సినిమాలో రాయనం పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఇందులో ఆయన నటనకు ప్రశంసలు అందుకున్నారు. దీంతో ప్రతినాయకుడిగా ఆఫర్లు కూడా ఎక్కువయ్యాయి. కేవలం హీరోగానే కాదు.. కంటెంట్..పాత్ర ప్రాధాన్యతను బట్టి విలన్ పాత్రలు చేసేందుకు కూడా వెనకడాని హీరో సేతుపతి. తమిళంతోపాటు.. తెలుగులోనూ మంచి సక్సెస్ అందుకున్న ఈ హీరో.. ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ రాణిస్తున్నారు. లేటేస్ట్ గా అక్కడ ఫర్జీ సినిమాతో బీటౌన్ ఎంట్రీ ఇచ్చారు. రాజ్ అడ్ డికే రూపొందించిన ఈ ఫర్జీ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ఫిబ్రవరి 10న విడుదల కానుంది. ఇందులో షాహిద్ కపూర్, రాశి ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. అయితే ఈ సిరీస్ ప్రమోషనల్లో పాల్గోన్న సేతుపతికి కొందరు అభిమానుల పిలుపు అసహనం తెప్పించింది. దీంతో ఆయన మాట్లాడుతూ ఫ్యాన్స్ కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సేతుపతిని పాన్ ఇండియా స్టార్ అంటూ పిలిచారు. దీంతో సేతుపతి మాట్లాడుతూ.. తన అభిమానులు.. ప్రజలు పాన్ ఇండియా స్టార్ అని పిలవకండి అన్నారు. విజయ్ మాట్లాడుతూ.. “నేను నటుడిని మాత్రమే. పాన్ ఇండియా స్టేట్మెంట్ తో నేను కంఫర్ట్ గా ఉండలేను. కొన్నిసార్లు ఆ పిలుపు నాపై ఒత్తిడిని పెంచుతుంది. కేవలం నేను నటుడిని మాత్రమే. దీని కింద ఎలాంటి లేబుల్ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి నన్ను అలా పిలవకండి. నేను అన్ని భాషల చిత్రాలను చేయాలనుకుంటున్నాను. బెంగాలీ, గుజరాతీ ఇలా నాకు అవకాశం దొరికితే నేను అన్ని భాషల్లోనూ పనిచేస్తాను. దయచేసి నన్ను పాన్ ఇండియా స్టార్ అని పిలవకండి” అంటూ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం విజయ్ సేతుపతి..షాహిద్ కపూర్, రాశిఖన్నా ప్రధాన పాత్రలలో నటించిన పర్జీ సిరీస్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 10న ప్రీమియర్ అవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us