Vijay Deverakonda: దుబాయ్ ఎడారిలో విజయ్.. రష్మిక టూర్.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..

|

Feb 02, 2023 | 11:30 AM

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. విజయ్‏తో కలిసి టూర్ వెళ్తే తప్పేంటీ అని ప్రశ్నించింది. మేమిద్దరం మంచి స్నేహితులమని.. ఫ్రెండ్స్ కలిసి టూర్స్ కు వెళ్లకూడదా ? అంటూ నెటిజన్స్‏కు కౌంటరిచ్చింది.

Vijay Deverakonda: దుబాయ్ ఎడారిలో విజయ్.. రష్మిక టూర్.. నెట్టింట వైరలవుతున్న ఫోటోస్..
Rashmika, Vijay
Follow us on

టాలీవుడ్ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస హిట్స్ ఎంజాయ్ చేస్తుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మిషన్ మజ్ను సక్సెస్ రుచి చూసింది. ఈసినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం దుబాయ్ వెకెషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అయితే రష్మికతోపాటు.. టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ సైతం దుబాయ్ టూర్‏లో గడుపుతున్నట్లుగా ఫోటోస్ చూస్తే అర్ధమవుతుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫోటోలలో నేషనల్ క్రష్‏తోపాటు.. విజయ్ కూడా కనిపించడంతో.. మరోసారి వీరిద్దరి ప్రేమాయణం గురించి ఫిల్మ్ సర్కిల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొద్దిరోజులుగా వీరిద్దరి ప్రేమ గురించి..ఇటీవలే వీరు కలిసి మాల్దీవ్స్ వెళ్లారంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక.. విజయ్‏తో కలిసి టూర్ వెళ్తే తప్పేంటీ అని ప్రశ్నించింది. మేమిద్దరం మంచి స్నేహితులమని.. ఫ్రెండ్స్ కలిసి టూర్స్ కు వెళ్లకూడదా ? అంటూ నెటిజన్స్‏కు కౌంటరిచ్చింది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలకు మరింత బలం చేకూరింది.

ఇక వీరిద్దరు కలిసి ఇప్పుడు దుబాయ్ టూర్ కు వెళ్లారు. విజయ్ దేవరకొండతో కలిసి ఓ అభిమాని సెల్ఫీ దిగడానికి ట్రై చేస్తుంటే.. మధ్యలో రష్మిక కూడా ఆ ఫోటోలో కనిపించేలా ఫోజ్ ఇస్తున్న ఓ ఫోటో బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట హల్చల్ చేస్తుంది. అయితే విజయ్ మాత్రమే కాకుండా.. అతని ఫ్యామిలీ కూడా ఈ టూర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రష్మిక ఇటీవలే పుష్ప 2 చిత్రీకరణలో జాయిన్ అయ్యింది. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇదే కాకుండా.. రష్మిక హిందీలో యానిమల్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో రణబీర్ కపూర్ కథానాయికుడిగా నటిస్తుండగా.. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి చిత్రం చేస్తున్నారు. ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.