
సినీ పరిశ్రమలో గుర్తింపు రావడం అంటే అంత సులభమైన విషయం కాదు. అనేక విమర్శలు, సవాళ్లు దాటుకుని వచ్చి తమకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తారలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు స్టార్ హీరోహీరోయిన్లుగా ఎదిగినవాళ్లంతా ఒకప్పుడు కష్టపడ్డవాళ్లే. అలాగే నటుడిగానే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్స్, రైటర్స్, టెక్నీషియన్స్, కొరియోగ్రాఫర్స్ గా ఎంట్రీ ఇచ్చి.. చివరకు హీరోగా తమదైన ముద్రవేసిన సెలబ్రెటీస్ ఉన్నారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న నటుడు ఒకరు. కెరీర్ మొదట్లో విలన్ పాత్రలతో మెప్పించి.. తనదైన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. అంతకుముందు తాను టీవీలో రైటర్ గా పనిచేశానని స్వయంగా ఆ హీరో చెప్పుకొచ్చాడు. అతడు మరెవరో కాదు.. తిరువీర్. నటనపై ఆసక్తితో నాటకరంగంలోకి అడుగుపెట్టాడు. నాటకాలు వేస్తూ కెరీర్ స్టార్ట్ చేసిన తిరువీర్.. బొమ్మలరామారం సినిమాతో నటుడిగా మారారు. జార్జ్ రెడ్డి, టక్ జగదీశ్ వంటి చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు.
ఎక్కువ మంది చదివినవి : S Janaki: ఆ ఒక్క పాట.. జానకమ్మ స్వరంలో మళ్లీ మళ్లీ వినాలనిపించే మెలోడీ.. అప్పుడు ఇప్పుడు యూత్ ఫేవరేట్ సాంగ్..
అయితే తిరువీర్ కెరీర్ మలుపు తిప్పిన సినిమా మసూద. ఈ చిత్రంలో పాజిటివ్ పాత్రలో నటించగా.. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. దీంతో తిరువీర్ పేరు తెలుగు సినీ రంగంలో మారుమోగింది. ఆ తర్వాత వరుసగా పరేషాన్, ప్రీ వెడ్డింగ్ షూట్ వంటి చిత్రాలతో హీరోగా మంచి విజయాలు అందుకున్నాడు. ఇటీవలే పాపం ప్రతాప్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించాడు. హిట్టు, ప్లాపులతో సంబంధమే లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ నటుడిగా వెండితెరపై సందడి చేస్తున్నాడు తిరువీర్. ఇదిలా ఉంటే ప్రస్తుతం తిరువీర్, ఐశ్వర్యరాజేష్ జంటగా నటించిన సినిమా ఓ సుకుమారి. జూలై 17న ఈ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ఈ చిత్రం ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ తిరువీర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
“ప్రస్తుతం సినీ పరిశ్రమలో రైటర్స్ లేరు. రచయితలే దర్శకులు అవుతున్నారు. నేను ఒకప్పుడు నాటకాలక రాసేవాడిని. నేనే డైరెక్టర్ చేసేవాడిని. డ్రామా జూనియర్స్ షోలో నేను స్కిట్స్ కూడా రాసాను. ఆ షోకు రైటింగ్ డిపార్మెంట్ లో పనిచేసాను. అలా స్కిట్స్ రాయగలను కానీ సినిమాలకు రాయలేను. మహా అయితే సినిమా కథకు సినాప్సిస్ రాస్తానేమో. అంతకు మించి నేను కథా రాయలేను. కానీ దర్శకులతో కథా చర్చల్లో మాత్రం పాల్గొంటాను” అంటూ చెప్పుకొచ్చాడు.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..