Tarun : తరుణ్ సూపర్ హిట్ మూవీ మిస్ చేసుకున్న అక్కినేని హీరో.. కారణం ఇదేనట..

|

Aug 09, 2024 | 7:20 PM

ప్రేమకథా సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన సుమంత్... ఫీల్ గుడ్ మూవీస్ తో అలరించి మెప్పించాడు. అక్కినేని నట వారసుల్లో ఒకరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. సత్యం, గౌరి, గోదావరి, గోల్కొండ హైస్కూల్ వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించే చిత్రాలను ఎంచుకుంటూ

Tarun : తరుణ్ సూపర్ హిట్ మూవీ మిస్ చేసుకున్న అక్కినేని హీరో.. కారణం ఇదేనట..
Tarun
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన ప్రేమకథలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో సుమంత్. అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా వెండితెరకు పరిచయమైన సుమంత్.. నటుడిగా తెలుగు అడియన్స్ హృదయాలలో స్థానం సంపాదించుకున్నాడు. ప్రేమకథా సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన సుమంత్… ఫీల్ గుడ్ మూవీస్ తో అలరించి మెప్పించాడు. అక్కినేని నట వారసుల్లో ఒకరిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. సత్యం, గౌరి, గోదావరి, గోల్కొండ హైస్కూల్ వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. యూత్, ఫ్యామిలీ ప్రేక్షకులను అలరించే చిత్రాలను ఎంచుకుంటూ నటుడిగా ప్రశంసలు అందుకున్నాడు. కానీ స్టార్ డమ్ మాత్రం అందుకోలేకపోయాడు. కొన్నాళ్లుగా సుమంత్ సినిమాలు అంతగా అడియన్స్ ముందుకు రావడం లేదు. ఇప్పుడిప్పుడే సహాయ నటుడిగా అలరిస్తున్నాడు. సీతారామం సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

మీ సినిమాలకు గ్యాప్ ఎందుకు వస్తుందని అడిగితే స్క్రిప్ట్ బాగా నచ్చితేనే సినిమా ఒప్పుకొంటానని అందుకే తన నుంచి కొత్త చిత్రాలు ఆలస్యంగా వస్తాయని గతంలో చెప్పుకొచ్చారు. కానీ మొత్తం సినీ కెరీర్ లో తన వద్దకు వచ్చి చేయలేకపోయిన సినిమా నువ్వే కావాలి అని అన్నారు. తన కెరీర్ మొదట్లోనే స్రవంతి రవికిషోర్ తనకు నువ్వే కావాలి ఆఫర్ ఇచ్చారని.. కానీ డేట్స్ కారణంగా చేయలేకపోయానని గతంలో ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను యువకుడు, పెళ్లి సంబంధం రెండు సినిమాలు ఒకేసారి చేస్తున్నానని.. అందుకే నువ్వే కావాలి సినిమా చేయడం కుదరలేదని అన్నారు. తన కెరీర్ లో అవకాశం వచ్చినా చేయలేకపోయిన సినిమా అదొక్కటే అని అన్నారు.

ప్రస్తుతం హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు సుమంత్. టాలీవుడ్ హీరో తరుణ్, రిచా జంటగా నటించిన నువ్వే కావాలి సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి కె. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా.. కోటి సంగీతం అందించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.