Nikhil Siddarth: పవన్ కోసం కీలకనిర్ణయం తీసుకున్న యంగ్ హీరో.. ఆ విషయంలో థియేటర్ ఓనర్‏తో మంతనాలు..

ఇలాంటి ఈ టైంలో తన సినిమాను ఓ థియేటర్ నుంచి తీసేయండని చెప్పి అందర్నీ షాక్ చేస్తున్నారు హీరో నిఖిల్.

Nikhil Siddarth: పవన్ కోసం కీలకనిర్ణయం తీసుకున్న యంగ్ హీరో.. ఆ విషయంలో థియేటర్ ఓనర్‏తో మంతనాలు..
Nikhil

Updated on: Aug 31, 2022 | 6:07 PM

ఓ పక్క తన కార్తికేయ2 సినిమా సూపర్ డూపర్ హిట్టైంది. వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చి మరీ.. జెట్‌ స్పీడులో దూసుకుపోతోంది. ఇలాంటి ఈ టైంలో తన సినిమాను ఓ థియేటర్ నుంచి తీసేయండని చెప్పి అందర్నీ షాక్ చేస్తున్నారు హీరో నిఖిల్. షాక్ చేయడమే కాదు.. తను తీసుకున్న ఈ నిర్ణయంతో అందరి మనసులు గెలుచుకున్నారు కూడా..! ఎస్ ! తన సినిమా కార్తికేయ2 ను తీసేసి.. పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ రీ రిలీజ్‌ జల్సా సినిమా స్క్రీనింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్న హీరో నిఖిల్… అందుకోసం ఆర్టీసీ క్రాస్‌ రోడ్లోని దేవీ థియేటర్‌ ఓనర్స్‌తో మాట్లాడారు. వారిని రిక్వెస్ట్ చేసి మరీ… సెప్టెంబర్ 1 ,2 న జల్సా సినిమాను స్క్రీనింగ్ చేయాలన్నారు.

ఇక ఈ న్యూస్ బయటికి రావడంతో… పవన్ ఫ్యాన్స్ నిఖిల్ను తెగ పొగిడేస్తున్నారు. పవన్ సినిమా సంబరం అయిపోయాక.. తన సినిమాను రిపీటెడ్‌ చేసి.. నిన్ను నిలబెడతాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us