న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ సినిమా సూపర్ హిట్ కావడంతో ఫుల్ జోష్ మీదున్నాడు. డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుని కలెక్షన్ల పరంగానూ దూసుకెళ్తుంది. మరోవైపు ఈ సినిమాలోని సాంగ్స్ యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి. ఇందులో సాయి పల్లవి, కృతి శెట్టి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ ఏడాది చివరన శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్న నాని.. కొత్త సంవత్సరం కానుకగా మరో సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.
నాని ప్రస్తుతం అంటే.. సుందరానికీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్రోచేవారేవరురా సినిమాతో హిట్ అందుకున్న వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నాని సరసన మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ పోస్టర్‌తో సినిమాపై క్యూరియాసిటీని పెంచేసింది చిత్రయూనిట్. తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్డేట్ ఇచ్చారు నాని. ఈ మూవీ నుంచి సుందర్‌ను పరిచయం చేయనున్నట్లు ప్రకటించారు న్యాచురల్ స్టార్ నాని. శ్యామ్ ఈ ఏడాదిని భారీగా ముగించాడు. ఇక సుందర్ కొత్త సంవత్సరాన్ని సందడితో ప్రారంభించే సమయం వచ్చేసింది. సుందర్‌ను జనవరి 1న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు పరిచయం చేయబోతున్నాం అంటూ ట్వీట్ చేశారు నాని.
ట్వీట్..
Shyam ends the year on a high.
Time for sundar to start the new year with a bang ?His parichayam on Jan 1st 🙂#ZerothLookOfSundar #NazriyaFahadh #VivekAthreya @MythriOfficial @oddphysce @nikethbommi #AnteSundharaniki pic.twitter.com/tUrStumbfC
— Nani (@NameisNani) December 30, 2021
Year Ender 2021: ఈ ఏడాది దుమ్మురేపిన మాస్ మసాలా సాంగ్స్.. ఊ అంటావా అంటూ.. ప్రేక్షకులను ఊపేశాయి..