Tollywood : దళపతి, రోజా సినిమాల్లో నేనే హీరోగా చేయాలి.. కానీ ఏం జరిగిందంటే.. టాలీవుడ్ నటుడు..
దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న నటుడు ఆనంద్. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలలో సహాయ పాత్రలు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించి గుర్తింపు పొందారు. 1987లో వచ్చిన 'వన్న కనవుగళ్' (తమిళం) సినిమాతో ఈయన నటనారంగంలోకి అడుగుపెట్టారు. తమిళంలో సత్య (1988), అపూర్వ సగోధరార్గల్ (1989), తలైవాసల్ (1992) వంటి విజయవంతమైన సినిమాల్లో నటించారు.

ప్రముఖ నటుడు ఆనంద్ ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ 40 ఏళ్ల సినీ ప్రస్థానంలోని ఎన్నో కీలక ఘట్టాలను, అనుభవాలను విపులంగా పంచుకున్నారు. ఆటుపోట్లు, నిరాశలు, విజయాలు, విమర్శలు – అన్నింటినీ అనుభవించిన తాను, నేడు పరిణతితో వాటిని ఎలా ఎదుర్కొంటున్నారో తెలియజేశారు. ఆనంద్ తన బాల్యం నుంచే రజినీకాంత్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులచే ప్రేరణ పొంది చిత్ర పరిశ్రమలోకి రావాలని ఆకాంక్షించారు. కమల్ హాసన్‌తో తన తొలి పరిచయం, ఆ తర్వాత వారితో కలిసి నటించిన క్షణాలను ఆయన ఉద్వేగంగా గుర్తుచేసుకున్నారు. కేవలం రెండు సంవత్సరాల వ్యవధిలోనే కమల్ హాసన్‌ను ఆరాధించిన అభిమాని స్థాయి నుండి, ఆయనతో కలిసి నటించే అవకాశాన్ని పొందడం తన జీవితంలో గర్వించదగిన విషయంగా పేర్కొన్నారు. కమల్ హాసన్ వర్క్‌షాప్‌లలో పాల్గొనడం, ఆయనతో భోజనం చేయడం వంటి మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో సినిమాలు… కట్ చేస్తే.. 51 ఏళ్ల వయసులో ప్రియుడిని పరిచయం చేసిన హీరోయిన్..
అయితే ఆనంద్ సినీ ప్రస్థానంలో అత్యంత ఆసక్తికరమైన భాగం దర్శకుడు మణిరత్నంతో ఆయనకున్న అనుబంధం. మణిరత్నం తొలి చిత్రమైన పగలిల్వ ప్రివ్యూ చూసిన తర్వాత, ఆయన దర్శకత్వంలోనే తన సినీ రంగ ప్రవేశం జరగాలని ఆనంద్ నిశ్చయించుకున్నారు. మౌనరాగం చిత్రంలో కార్తీక్ పోషించిన పాత్ర కోసం 17 ఏళ్ల వయసులో ప్రయత్నించినప్పుడు, వయసు తక్కువవడం వల్ల అవకాశం కోల్పోయారు. ఆ తర్వాత అగ్ని నక్షత్రం చిత్రానికి సహాయకుడిగా కొన్ని రోజులు పనిచేశానని, కానీ తనను నటుడిగా కాకుండా కేవలం సహాయకుడిగా ఉపయోగించుకుంటున్నారని గ్రహించి బయటకు వచ్చానని వివరించారు. నిరాశ చెందకుండా, ఆనంద్ తన ప్రయత్నాలను కొనసాగించారు. దళపతి చిత్రంలో అరవింద్ స్వామి పాత్ర కోసం ఆయనకు టెలిగ్రామ్ వచ్చి, ఆ షూటింగ్‌లో పాల్గొనడానికి మైసూరు వెళ్ళినా, ఆ పాత్ర దక్కలేదు. అనంతరం రోజా చిత్రంలోనూ అరవింద్ స్వామి పాత్ర కోసం స్క్రీన్ టెస్ట్‌కు వెళ్లినా, మణిరత్నంని చూడగానే కలిగిన టెన్షన్ వల్ల సరిగా చేయలేక, ఆ అవకాశాన్ని కూడా పోగొట్టుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : ఇప్పుడున్న హీరోలలో అతడు ది బెస్ట్.. అతడి యాక్టింగ్ అంటే చాలా చాలా ఇష్టం.. కృష్ణ మనసులోని మాట..
ప్రతి సినిమాకు మణిరత్నం నుండి పిలుపు రావడాన్ని, కానీ అవకాశం దక్కకపోవడాన్ని తలచుకుంటూ, “సార్, ప్రతిసారి పిలిచి ఇలా చేస్తున్నారు?” అని ఆయనను నేరుగా ప్రశ్నించినట్లు ఆనంద్ తెలిపారు. అప్పుడు మణిరత్నం, “తదుపరి చిత్రంలో నీకే అవకాశం ఇస్తాను” అని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అలా ఇచ్చిన హామీ ప్రకారం, అంజలి చిత్రంలో ఆనంద్‌కు మణిరత్నం అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత దొంగ దొంగ (తిరుడ తిరుడ) చిత్రంలో ఆనంద్ హీరోగా నటించారు. మణిరత్నం దగ్గర నుండి ఇన్ని అవకాశాలు, ఇంత ప్రేమ ఎందుకు లభించాయని అడిగినప్పుడు, ఆనంద్ తన పట్టుదలను, నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండడాన్ని కారణాలుగా చూపారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : నవ్వుల రారాజును వెంటాడిన మృత్యువు.. రెండుసార్లు గెలిచినా.. వదలని మరణం..
ఆనంద్ ఫోటో..

Anand Movies
ఎక్కువ మంది చదివినవి : Tollywood : అరుంధతి మూవీలో సోనుసూద్ క్యారెక్టర్ నేను చెయ్యాలి.. కానీ ఎలా మిస్సైందంటే..
