శ్రీలీల క్రేజ్ ఢమాల్, డైలమాలో టాలీవుడ్ యంగ్ బ్యూటీ కెరీర్
టాలీవుడ్ లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటేనే ఏ హీరోయిన్ అయినా రాణించగలుగుతుంది. ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుంది. ఒక్కసారి ఫెయిల్యూర్స్ పలుకరించాయంటే ఇక అంతే సంగతులు. టాలీవుడ్ తెరపై అన్యూహంగా దూసుకొచ్చిన శ్రీలీల కెరీర్ డైలమాలో పడిందనే టాక్ వినిపిస్తోంది

టాలీవుడ్ లో సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటేనే ఏ హీరోయిన్ అయినా రాణించగలుగుతుంది. ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుంది. ఒక్కసారి ఫెయిల్యూర్స్ పలుకరించాయంటే ఇక అంతే సంగతులు. టాలీవుడ్ తెరపై అన్యూహంగా దూసుకొచ్చిన శ్రీలీల కెరీర్ డైలమాలో పడిందనే టాక్ వినిపిస్తోంది. తన తొలి చిత్రం “పెళ్లి సందడి”తో ఒక్కసారిగా ఫేమ్ అయిన నటి శ్రీలీల. తన డ్యాన్స్ స్కిల్స్ తో టాలీవుడ్ ప్రేక్షకులను, ఇటు దర్శక నిర్మాతలను అట్రాక్ట్ చేసింది. దీంతో ఆమెకు ఒక్కసారిగా యూత్ మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఆమెకున్న ఫాలోయింగ్ కారణంగా మొదట్లో పెద్ద నటీనటులతో పాటు చాలా ఆఫర్‌లను పొందింది. అందం, అభినయంతో టాలీవుడ్ ను శాసించబోతోందని చాలామంది ఊహించారు. కానీ మహేశ్ బాబు తో కలిసిన నటించిన చిత్రం గుంటూరు కారం మూవీతో ఒక్కసారిగా ఢమాల్ అనిపించింది.
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద మోస్తారుగా ఆడటంతో శ్రీలీల క్రేజ్ తగ్గిందని రూమర్స్ వినిపిస్తున్నారు. ఇక ఆమె క్రేజ్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. వరుస సినిమాలు చేస్తున్న, పెద్ద పెద్ద బ్యానర్లలో నటిస్తున్నా వర్కవుట్ కావడం లేదు. స్కంధ, గుంటూరు కారం సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఈ బ్యూటీకి డిమాండ్ తగ్గిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆమె చివరి చిత్రం “గుంటూరు కారం” కోసం ఆమె అత్యధికంగా 4 కోట్లు తీసుకుంది. ఈ విషయం తెలిసి ఇతర నిర్మాతలు ఆమెను సంప్రదించడం లేదు.
తన రెమ్యునరేషన్‌పై చర్చలు జరపడానికి కూడా సుముఖత వ్యక్తం చేయడం లేదు. నిజానికి, ఆమె కెరీర్‌ను కంటిన్యూ చేయాలంటే రెమ్యునరేషన్‌ను భారీగా తగ్గించుకోవాలి. అంతేకాకుండా, చిన్మయి సమంత కెరీర్‌కు సంవత్సరాల తరబడి ఎలా ఉపయోగపడిందో, సుదీర్ఘమైన కెరీర్‌ని కొనసాగించాలంటే సరైన డబ్బింగ్ ఆర్టిస్ట్‌తో కలిసి పనిచేయాలని కూడా విమర్శకులు సూచిస్తున్నారు. కేవలం డాన్సులు మాత్రమే సరిపోదని, మంచి కథబలమున్న భగవంత్ కేసరి లాంటి సినిమాల్లో నటించాలని సినీ క్రిటిక్స్ అభిప్రాయ పడుతున్నారు. అయితే వరుస ఫెయిల్యూర్ తో శ్రీలీల తన రెమ్యూనరేషన్ తగ్గించుకుంటుందా లేదా అనేది చూడాల్సిందే.
Here it is.. The Theatrical trailer of our #GunturKaaram 💥💥
Let’s celebrate Sankranthi in a MASSIVE way with the arrival of Reigning Super 🌟 @urstrulyMahesh 🔥🤩
Meet you all at the cinemas on JAN 12th ❤️🔥🕺#GunturKaaramOnJan12th 🌶… pic.twitter.com/NfKR4Hun4H
— sreeleela (@sreeleela14) January 7, 2024