AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Film News: వారివల్లే నమ్మకం కలిగిందన్న చైతూ.. అసూయ లేదన్న సామ్..

వారివల్లే తండేల్‌పై నమ్మకం కలిగింది అన్నారు నాగచైతన్య. కోపం వల్ల తన జీవితంలో మంచి వ్యక్తిని కోల్పోయానని చెప్పారు నటి పార్వతీ తిరువోతు. తన జీవితంలో అసూయకు అసలు తావులేదన్నారు నటి సమంత. నటి కంగన రనౌత్‌ కల నెరవేరింది. అలాంటి వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని స్టార్ హీరోపై విక్కీ కౌశల్‌ కామెంట్స్. ఇలాంటి సినిమా వార్తలు ఈరోజు తెలుసుకుందాం.. 

Prudvi Battula
|

Updated on: Feb 07, 2025 | 7:27 AM

Share
శ్రీకాకుళం ప్రజల జీవన విధానం, యాస తదితర విషయాల్లో హోమ్‌ వర్క్ చేశాక, తండేల్‌ చేయగలననే నమ్మకం వచ్చిందని తెలిపారు హీరో నాగచైతన్య. ఇందులో మంచి లవ్‌స్టోరీతో పాటు మాస్‌ అంశాలు కూడా ఉంటాయని తెలిపారు. నిజమైన ప్రేమలో ఉండే పెయిన్‌ని తండేల్‌లో ప్రధానంగా చూపించామని చెప్పారు చైతూ.

1 / 5
 కోపం వల్ల తన జీవితంలో మంచి వ్యక్తిని కోల్పోయానని చెప్పారు నటి పార్వతీ తిరువోతు. తాను గతంలో ఓ వ్యక్తితో డేటింగ్‌ చేశానని చెప్పారు. అతను చాలా మంచివాడని, తన నుంచి విడిపోయాక విలువ తెలిసిందని అన్నారు. ఆ బ్రేకప్‌ జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిందన్నారు పార్వతి. తంగలాన్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు ఈ బ్యూటీ.

2 / 5
తన జీవితంలో అసూయకు అసలు తావులేదన్నారు నటి సమంత. లైఫ్‌లో అసూయ భాగం కావడాన్ని ఏమాత్రం అంగీకరించనని చెప్పారు. అసూయే అన్నీ అనర్థాలకు మూలంగా భావిస్తానని తెలిపారు. మాజీ భాగస్వామి కొత్త జీవితంలో అడుగుపెట్టినందుకు అసూయ పడుతున్నారా? అని ప్రశ్నించగా ఇలా స్పందించారు సమంత.

3 / 5
ది మౌంటైన్‌ స్టోరీ పేరుతో హిమాలయాల్లో కేఫ్‌ ఏర్పాటు చేశారు నటి కంగన రనౌత్‌. ఫిబ్రవరి 14 నుంచి ఇది ప్రారంభం కానుంది. ట్రెడిషనల్‌ హిమాచల్‌ ఫుడ్‌ను మోడ్రన్‌ రెసిపీలతో కలిసి అందించడమే తన ధ్యేయమని చెప్పారు. రెస్టారెంట్‌ స్టార్ట్ చేయాలన్న తన చిన్న నాటి కల నెరవేరినందుకు ఆనందంగా ఉందన్నారు కంగన.

4 / 5
షారుఖ్‌ లెజెండ్‌ అని, అలాంటి వ్యక్తిని తాను ఎక్కడా చూడలేదని తెలిపారు విక్కీ కౌశల్‌. షారుఖ్‌తో కలిసి డంకీలో నటించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. డంకీ మూవీతో తన చాలా కలలు నెరవేరాయని చెప్పారు విక్కీ. ఆయన నటించిన చావా ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు విక్కీ.

5 / 5