బుల్లితెరపై జబర్దస్త్ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది కళాకారుల సినీ కెరీర్‌కు అండగా నిలిచింది. ఈ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుని ప్రస్తుతం చిత్రపరిశ్రమలో నటులుగా తమకంటూ గుర్తింపు తెచ్చుకున్నవారు అనేక మంది ఉన్నారు. హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, రామ్ ప్రసాద్, చమ్మక్ చంద్ర, రాకెట్ రాఘవ, బుల్లెట్ భాస్కర్ ఇలా ఒక్కరేమిటీ అనేక మంది ఆర్టిస్ట్స్ జబర్దస్త్ నుంచి వచ్చినవారే.. తమదైన కామెడీ స్కి్ట్స్తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. అయితే తాజాగా జబర్ధస్త్ ఫేమస్ నటుడు తన టీనేజ్ ఫోటోస్ నెట్టింట షేర్ చేశారు.. ప్రస్తుతం ఆ ఫోటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
పైన ఫోటోను చూశారు కదా.. నాలుక మడతబెట్టి పవర్ ఫుల్ విలన్‌గా చూపులతోనే భయపెట్టేస్తున్న ఈ నటుడు ఎవరో గుర్తుపట్టండి.. జబర్ధస్త్ ఫేమస్ కమెడియన్.. తనదైన కామెడీ పంచులతో బుల్లితెర ప్రేక్షకులను చేరువయ్యాడు. అతను మరెవరో కాదు. రచ్చ రవి. ఆయన గురించి బుల్లితెర ప్రేక్షకులకు పెద్దగ పరిచయం అవసరం లేదు. చమ్మక్ చంద్ర టీంలో ఉండి తన కామెడీతో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు రవి.. తదనైన కామెడీ డైలాగ్స్.. పంచులతో జనాలను అలరించాడు.. ఆతర్వాత రచ్చ రవి టీం లీడర్ కూడా అయ్యాడు. అలా చాలా కాలం పాటు ప్రేక్షకులను కామెడీతో నవ్వించాడు రచ్చ రవి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.